Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘స్ట్రా’ అతిగా వాడితే.. ఈ రోగాలు మీకు ఎక్స్‌ట్రా బోనస్.. అవసరమా మనకి ఇవి..

‘స్ట్రా’ అతిగా వాడితే.. ఈ రోగాలు మీకు ఎక్స్‌ట్రా బోనస్.. అవసరమా మనకి ఇవి..

Phani CH
|

Updated on: Jun 23, 2025 | 8:33 PM

Share

కొబ్బరి బొండాలు, కూల్ డ్రింక్స్, కోల్డ్ కాఫీ, మిల్క్ షేక్‌ తాగేటప్పడు మనం ‘స్ట్రా’ వాడుతుంటాం. అయితే, అతిగా స్ట్రాలతో పానీయాలు తాగడం వల్ల కూడా కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆరోగ్యం పట్ల సమాజంలో స్పృహ బాగా పెరగటంతో ఘన ఆహారాన్ని తగ్గించి.. పలువురు పలు పళ్ల రసాలు, పానీయాలను బాగా తాగుతున్నారు.

ముఖ్యంగా బరువు తగ్గడానికి, జీవక్రియలు మెరుగుపడటానికి వీరు పానీయాలు, పండ్ల రసాలను ఆశ్రయిస్తున్నారు. అయితే, వీటిని స్ట్రా సాయంతో తాగే క్రమంలో బుగ్గలు, పెదవుల మీద ఒత్తిడి పడటమే గాక.. నాలుక పనితీరు దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్ట్రా ను ఎక్కువగా వాడే వారిలో పానీయాన్ని తాగే పద్ధతుల్లో వస్తున్న ప్రమాదకర మార్పులను వైద్యులు గుర్తించారు. నాలుక ఆకారం మారుతున్న కొద్దీ ఆ ప్రాంత కండరాలు అతిగా స్పందించి క్రమంగా బలహీనపడతాయని వారు హెచ్చరిస్తున్నారు. గ్లాసులోని పానీయం అయిపోయే వరకు ఏకబిగిన స్ట్రాతో మొత్తం తాగటానికి బదులుగా.. కొంచెం కొంచెంగా పానీయాన్ని స్ట్రాతో నోట్లోకి తీసుకుని.. ఆ తర్వాత స్ట్రా నోట్లోంచి తీసి పానీయాన్ని మామూలుగా మింగాలని డాక్లర్లు సూచిస్తున్నారు. ఇలా చేయటం వల్ల నాలుక కండరాల పనితీరుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని వారు భరోసా ఇస్తున్నారు. ఈ పద్ధతి నోటి ఆరోగ్యానికి సహకరిస్తుందని, కనుక ఇకనైనా.. స్ట్రా నుంచి పానీయాన్ని జుర్రుకునే పద్దతి మార్చుకోవాలని వారు అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొదలైన వర్షాకాలం.. ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు తీసుకోలేదో.. ఈ రోగాలు రావడం పక్కా

కలిసి మందు కొట్టారు.. పిల్లలిద్దరికీ పెళ్లి చేద్దామనుకున్నారు.. కట్‌ చేస్తే..

ఫాస్టాగ్ యాన్యువల్ పాస్.. అదిరిపోయే ఆఫర్ గురూ

క్లాస్‌ రూమ్‌లో శ్రద్ధగా చదువుకుంటున్న విద్యార్థులు.. ఉన్నట్టుండి హాజరైన అనుకోని అతిధి.. కట్ చేస్తే

మరోసారి జంటగా కనిపించిన విజయ్‌దేవరకొండ-రష్మిక.. ఈసారి