రానా, బన్నీ వాట్సాప్ గ్రూప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా
మంచు విష్ణు టాలీవుడ్ హీరోల వాట్సప్ గ్రూపు నుంచి బయటకు వచ్చేశారా? రానా, బన్నీ ప్రారంభించిన ఈ గ్రూప్ నుంచి విష్ణు బయటకు వచ్చేయడానికి కారణం ఏంటి? ప్రస్తుతం 'కన్నప్ప' ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న విష్ణు ఈ సమయంలో ఈ వాట్సప్ గ్రూపునుంచి బయటకు వచ్చేయడం వెనుక బలమైన కారణమే ఉందా? మంచు విష్ణు తన తాజా చిత్రం కన్నప్ప ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖ నటీనటులు సభ్యులుగా ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి తాను ఎందుకు బయటకు వచ్చేశారో వివరించారు. ఈ గ్రూప్‌లో రానా దగ్గుబాటి, అల్లు అర్జున్ , రామ్ చరణ్ వంటి పలువురు అగ్ర నటులు ఉన్నట్లు ఆయన తెలిపారు. టాలీవుడ్ హీరోలు చాలామంది ఉన్న వాట్సాప్ గ్రూప్ నుంచి మీరు ఎందుకు బయటకు వచ్చారు? అన్న ప్రశ్నకు విష్ణు బదులిస్తూ… ఆ వాట్సాప్ గ్రూప్‌ను రానా, బన్నీ ప్రారంభించారని, తాను కూడా ఒకప్పుడు అందులో సభ్యుడిగా ఉండేవాడినని తెలిపారు. అయితే, ఆ గ్రూప్‌లో చాలా మంది హీరోయిన్లు కూడా ఉండటం వల్ల అందరితో కలిసి చాట్ చేయాలంటే తనకు సిగ్గుగా, మొహమాటంగా అనిపించేదని, అందుకే ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చేశానని స్పష్టం చేశారు. అయితే, ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే తనకు వ్యక్తిగతంగా మెసేజ్ చేయమని రానా, బన్నీలకు చెప్పినట్లు విష్ణు పేర్కొన్నారు. అలాటే, తోటి నటీనటులతో తనకున్న అనుబంధం గురించి విష్ణు మాట్లాడుతూ… నేను, రానా, బన్నీ, రామ్‌చరణ్, ఎన్టీఆర్ మేమంతా చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. మా మధ్య చాలా మంచి స్నేహబంధం ఉంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కాల్‌తో ఒకరికొకరం అండగా నిలబడతాం. మా మధ్య ఒక ఎమోషనల్ రిలేషన్‌షిప్ ఉంది. ఇలా కలిసికట్టుగా ఉండటం అనేది మా తల్లిదండ్రులు మాకు నేర్పిన గొప్ప విషయాల్లో ఒకటి. ఆ సంప్రదాయాన్ని మేమిప్పటికీ కొనసాగిస్తున్నాం” అని వివరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘స్ట్రా’ అతిగా వాడితే.. ఈ రోగాలు మీకు ఎక్స్‌ట్రా బోనస్.. అవసరమా మనకి ఇవి..
మొదలైన వర్షాకాలం.. ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు తీసుకోలేదో.. ఈ రోగాలు రావడం పక్కా
కలిసి మందు కొట్టారు.. పిల్లలిద్దరికీ పెళ్లి చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే..
ఫాస్టాగ్ యాన్యువల్ పాస్.. అదిరిపోయే ఆఫర్ గురూ
క్లాస్ రూమ్‌లో శ్రద్ధగా చదువుకుంటున్న విద్యార్థులు.. ఉన్నట్టుండి హాజరైన అనుకోని అతిధి.. కట్ చేస్తే

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

నమీబియా పార్లమెంట్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
