Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్‌ సీక్రెట్‌.. క్యారెట్‌ జ్యూస్‌లో తేనె కలిపి తీసుకుంటే..

టాప్‌ సీక్రెట్‌.. క్యారెట్‌ జ్యూస్‌లో తేనె కలిపి తీసుకుంటే..

Phani CH
|

Updated on: Jun 24, 2025 | 4:28 PM

Share

సాధారణంగా ఫ్రూట్‌ జ్యూస్‌, కొన్ని రకాల కూరగాయల జ్యూస్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిదని, వాటిని తరచూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఈ క్రమంలో రకరకాల జ్యూస్‌లు తాగుతుంటారు చాలామంది. ఇప్పుడు మనం క్యారెట్‌ జ్యూస్‌కి సంబంధించి ఓ రహస్య సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సాధారణంగా క్యారెట్‌ జ్యూస్‌ రక్తహీనత తగ్గిస్తుంది.

కంటిచూపు మెరుగుపరుస్తుంది ఇవన్నీ మనకు తెలిసినవే. మరి క్యారెట్‌ జ్యూస్‌ వెనుక ఉన్న ఆ సీక్రెట్‌ ఏమై ఉంటుంది? రక్తహీనత ఉన్నవారికి క్యారెట్ జ్యూస్‌ అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో తేనె కలిపి తీసుకుంటే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది. క్యారెట్, టమాటా జ్యూస్‌, చీనీపండ్ల జ్యూస్‌ని కలిపి కనీసం ఇరవై ఐదు గ్రాములు చొప్పున రెండు నెలలపాటు రెగ్యులర్‌గా తీసుకుంటే నోటి అల్సర్, ముఖంపై ముడతలు మాయమవుతాయట. ఇప్పుడు అర్ధమైందా సీక్రెట్‌ ఏమిటో. అలాగే నిద్రలేమితో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఉదయం-సాయంత్రం రెండుపూటలా క్యారెట్ జ్యూస్‌ తీసుకోవటం వల్ల మీరు ఊహించని ఫలితం వుంటుంది. క్రమం తప్పకుండా క్యారెట్ జ్యూస్‌ తీసుకుంటూ ఉంటే.. ఉదర సంబంధమైన రోగాలు, పిత్తం, కఫం, మలబద్దకం దూరమవుతాయి. క్యారెట్‌ను ఉడకబెట్టి చల్లార్చిన తర్వాత కప్పు రసంలో చెంచా తేనెను కలిపి సేవిస్తే గుండెల్లో మంట మటుమాయం అవుతుంది. క్యారెట్ జ్యూస్‌ మహిళలల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు బాగా ఉపయోగపడుతుంది. పరగడుపున క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల దానిలోని పోషకాలు శరీరం బాగా గ్రహించబడతాయి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయం క్యారెట్ జ్యూస్ తాగడం కుదరకపోతే, భోజనానికి ఒక గంట ముందు లేదా భోజనం చేశాక రెండు గంటల తర్వాత కూడా తాగవచ్చు. క్యారెట్ జ్యూస్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై బస్సుల్లో వైఫై