Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊపిరితిత్తుల ద్వారా మన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవచ్చు

ఊపిరితిత్తుల ద్వారా మన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవచ్చు

Phani CH
|

Updated on: Jun 24, 2025 | 4:44 PM

Share

ఈ రోజుల్లో ఊపిరితిత్తుల సమస్యలు సర్వ సాధారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నగరాల్లో వాయు కాలుష్యం పెరగడం, పొగ తాగడం, జీవిత విధానంలో మార్పులు కారణంగా శ్వాసకోశాలకు సంబంధించి అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనందరం ఒకే విధంగా ఊపిరి పీల్చం అనుకోవచ్చు. కానీ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి ఒక ఆశ్చర్యకర విషయాన్ని వెలికితీశారు.

మనం పీల్చే ఊపిరిలోని వాసన, ప్రవాహం, విధానం ఇవన్నీ మన ఆరోగ్యానికి సంబంధించిన అనేక అంశాల గురించి సమాచారం ఇస్తాయని వారు తేల్చారు. శ్వాసలో ఉండే ఈ ప్రత్యేక లక్షణాలను “ఊపిరి ఫింగర్‌ప్రింట్స్”గా వారు పేర్కొన్నారు. ఈ “ఫింగర్‌ప్రింట్స్” ద్వారా మన బాడీ మాస్ ఇండెక్స్ , నిద్ర నియమాలు, ఆందోళన స్థాయిలు , ప్రవర్తనా లక్షణాలు తెలిసే అవకాశముందని వారు అభిప్రాయపడ్డారు. ఈ పరిశోధనను ఇజ్రాయెల్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఇది ప్రముఖ జర్నల్ అయిన “కరెంట్ బయాలజీ”లో ప్రచురితమైంది. వారు రూపొందించిన పరికరాన్ని ఉపయోగించి, శ్వాస మార్గాన్ని 24 గంటలపాటు విశ్లేషించారు. వారు ఉపయోగించిన పరికరం ఒక చిన్న, తేలికైన డివైస్. దీని ద్వారా ముక్కులో నలువైపులా చిన్న ట్యూబులు ఉంచి, శ్వాస ప్రవాహాన్ని ఆల్-టైమ్ ట్రాక్ చేశారు. పరీక్షలో పాల్గొన్నవారిలో, ఎక్కువ ఆందోళనతో బాధపడే వ్యక్తులకు చిన్నపాటి శ్వాసలతో పాటు నిద్రలో ఊపిరి తీయడంలో మార్పులు కనిపించాయని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా ఊపిరి లోపలికి తీయడం తక్కువ సమయంతో జరగడం, నిద్రలో తీసుకునే ఊపిరిలో ఎక్కువ వైవిధ్యం ఉండటం వంటి లక్షణాలు ఉన్నాయని తేలింది. మన శ్వాస విధానంలో జరిగే మార్పుల ఆధారంగా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను గుర్తించవచ్చు. ముఖ్యంగా, ఆందోళన స్థాయి, నిద్ర రుతువులు, ప్రవర్తనా లక్షణాలు మొదలైనవి . ఇవన్నీ శ్వాస మార్గంలో కనిపించే నమూనాల ద్వారా అంచనా వేయవచ్చని వారు చెబుతున్నారు. అంతేకాదు, ఈ పరిశోధన మనం ఎలా ఊపిరి తీసుకుంటామో అర్థం చేసుకునే మార్గంలో విప్లవాత్మకమైన దిశగా దారి చూపించగలదని కూడా శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాప్‌ సీక్రెట్‌.. క్యారెట్‌ జ్యూస్‌లో తేనె కలిపి తీసుకుంటే..

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై బస్సుల్లో వైఫై