రోడ్డుపక్కన ఫుడ్ స్టాల్‌లో సర్వర్‌గా పని చేస్తున్న కోతి.. సెల్ఫీలు తీసుకుంటున్న కస్టమర్స్
సాధారణంగా కోతులు మనుషుల చేతిలో ఏదైనా చూసాయంటే వెంటనే లాక్కొని పారిపోతుంటాయి. అది తినేదా.. కాదా.. అని కూడా చూడవు. ఇలాంటి ఘటనలు ఆలయాల వద్ద ఎక్కువగా జరుగుతాయి. ఎందుకంటే ఆలయ పరిసరాల్లో కోతులు ఎక్కువగా ఉంటాయి. భక్తులు దేవుడి కోసం తీసుకెళ్లే ప్రసాదాలను మధ్యలో ఈ కోతులు స్వాహా చేస్తాయి. అయితే తాజాగా ఓ కోతి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది.
ఓ ఫుడ్ స్టాల్‌లో కస్టమర్స్‌కి ఎంతో పొందికగా భోజనం వడ్డిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం… రోడ్డుపక్కన ఓ ఫుడ్ స్టాల్ ఉంది. కస్టమర్స్ తమ ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఓ కోతి అక్కడికి వచ్చి ఓ చేతిలో గరిటె, మరో చేతిలో ప్లేటు పట్టుకుని పులిహోరను ప్లేటులోకి వేసి, అందులో కూర కూడా వేసి కస్టమర్లకు అందిస్తుంది. ఆ తర్వాత మరో ప్లేటులో చికెన్, చపాతీ పెట్టి మరో కస్ట్‌మర్‌కి అందిస్తుంది. ఇలా ఎవరు ఏది కావాలంటే అది చక్కగా వడ్డించి వారికి అందిస్తోంది. ఆహారాన్ని చూడగానే తినేసే కోతులు.. అందుకు విరుద్ధంగా ప్లేటులో వడ్డించడం చూసి అంతా అవాక్కవుతున్నారు. అక్కడున్న వారంతా ఈ కోతిని ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. అయితే దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాంసాన్ని ముట్టుకోని కోతి చేత.. ఇలా చికెన్ వడ్డిస్తున్నట్లు ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేయడమేంటని మండిపడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. ఇది ఏఐ సృష్టి. టెక్నాలజీ ఉందికదా అని ఇలా చేయడం చాలా తప్పు అంటున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను దాదాపు 50 వేలమంది లైక్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఊపిరితిత్తుల ద్వారా మన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవచ్చు
టాప్ సీక్రెట్.. క్యారెట్ జ్యూస్‌లో తేనె కలిపి తీసుకుంటే..

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

నమీబియా పార్లమెంట్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
