AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వీడే తిరుమలరావు – తల్లీకూతుళ్లతో సంబంధం పెట్టుకుని – పాపం తేజేశ్వర్

జోగులాంబ గద్వాలలో సర్వేయర్ గంటా తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తేజేశ్వర్‌తో వివాహం అయ్యాక కూడా ప్రియుడితో వ్యవహారం నడపాలని ఐశ్వర్య భావించింది. కానీ భర్త గద్వాల్‌లోనే కాపురం పెట్టడంతో తన ప్లాన్ బెడికొట్టింది. దీంతో తన ప్రియుడు తిరుమలరావుతో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నింది. సుపారీ గ్యాంగ్ సహాయంతో కృష్ణస్వామి ఆలయం సమీపంలో హత్యచేసి.. మృతదేహాన్ని పాణ్యం అటవీ ప్రాంతంలో వదిలేశారు.

Telangana: వీడే తిరుమలరావు - తల్లీకూతుళ్లతో సంబంధం పెట్టుకుని - పాపం తేజేశ్వర్
Gadwal Surveyor Murder
Ram Naramaneni
|

Updated on: Jun 24, 2025 | 1:46 PM

Share

జోగులాంబ గద్వాలలో సర్వేయర్ గంటా తేజేశ్వర్ హత్య కేసు విచారణలో సినిమాకు మించిన ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. భార్య వివాహేతర సంబంధమే తేజేశ్వర్ హత్యకు ప్రధాన కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు.

తేజేశ్వర్‌కు కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన ఐశ్వర్యతో ఈ ఏడాది ఫిబ్రవరి 13న పెద్దలు వివాహం నిశ్చయించారు. కానీ ఐశ్వర్య ఇప్పటికే వివాహితుడైన బ్యాంకు ఉద్యోగి తిరుమలరావుతో ప్రేమలో ఉంది. దీంతో పెళ్లికి కొద్ది రోజులు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో పెళ్లి క్యాన్సిల్ చేశారు. తర్వాత మే నెలలో ఐశ్వర్య తేజేశ్వర్‌కు మళ్లీ కాంటాక్ట్‌లోకి వచ్చింది. తన తల్లి కట్నకానుకలు ఇవ్వలేక బాధ పడుతూ ఉండటంతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపింది. దీంతో ఆమెను నమ్మి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు తేజేశ్వర్. తల్లిదండ్రులు ఈ సంబంధం ఎందుకో మంచిగా అనిపించడం లేదని చెప్పినా వినలేదు. ఎలాంటి కట్నకానుకలు తీసుకోకుండా బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో మే 18న ఐశ్వర్యను పెళ్లాడాడు తేజేశ్వర్.

అయితే ఫిబ్రవరిలో తేజేశ్వర్‌తో పెళ్లి కుదరగానే.. ఐశ్వర్యను తిరుమల రావు తన ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే అక్కడ అతని కుటుంబంతో ఇబ్బందులు తలెత్తడంతో.. ఉండలేక ఇంటికి తిరిగొచ్చింది ఐశ్వర్య. తేజేశ్వర్‌నే పెళ్లి చేసుకుని.. తిరుమలరావుతో సంబంధం కొనసాగించాలని అనుకుంది. అందుకే వివాహం అయిన తరువాత కూడా ఐశ్వర్య తిరుమలరావుతో సంబంధాన్ని కొనసాగించేందుకు కర్నూలులో ఉండాలని ప్రయత్నించింది. కానీ తేజేశ్వర్ గద్వాల నుంచి కదలకపోవడంతో అతనిని హత్య చేయాలని కుట్ర పన్నింది. తిరుమలరావుతో కలిసి.. కర్నూలు సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దించారు.

తేజేశ్వర్‌ను ఈ నెల 17న భూమి సర్వే పేరుతో కారులో తీసుకెళ్లారు. మొగలిరావు చెరువు నుంచి వీరాపురం కృష్ణస్వామి ఆలయం వద్ద, అతడిని మారణాయుధాలతో దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆయుధాలు, సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను కృష్ణానదిలో పడేసి, మృతదేహాన్ని పాణ్యం అటవీ ప్రాంతంలో వదిలేశారు. పెళ్లైన 29 రోజుల్లో 15 రోజులు ఐశ్వర్య కర్నూలులో గడిపింది. నాలుగు నెలల్లో తిరుమలరావుతో 2,000కి పైగా ఫోన్‌కాల్స్ మాట్లాడటంతో పాటు వందల సందేశాలు పంపింది.

నిందితుల కోసం గద్వాల పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఐశ్వర్య, ఐశ్వర్య తల్లి సుజాతతో పాటు సుపారీ గ్యాంగ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని గద్వాల ఎస్పీ శ్రీనివాస్‌రావు తెలిపారు. కాగా తిరమలరావుకు ఐశ్వర్య తల్లితో కూడా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా హత్యకు ముందు తేజేశ్వర్‌ బైక్‌కి భార్య జీపీఎస్ ట్రాకర్ పెట్టినట్లు ఎస్పీ నిర్ధారించారు.

కాగా మొదట భార్యను చంపి, అనంతరం తేజేశ్వర్‌ను కూడా హత్య చేయించాలని తిరుమలరావు భావించినట్లు సమాచారం. అయితేభార్యను హత్య చేస్తే కుటుంబ సభ్యులు, బంధువుల్లో చెడు పేరు వస్తుందని  తిరుమలరావు వెనక్కి తగ్గాడు.  తేజేశ్వర్ హత్య తర్వాత కొన్నాళ్ళు లడక్ వెళ్లి అక్కడే ఉండాని తిరుమల్ రావు, ఐశ్వర్య భావించారు.  తేజేశ్వర్‌ను పరశురామ్, రాజు, నాగేష్ హత్య చేశారు. కారు ముందు సీటులో కూర్చున్న తేజేశ్వర్‌ గొంతు కోశారు ఇద్దరు నిందితులు.  డ్రైవింగ్ చేస్తూ తేజేశ్వర్‌పై మరో నిందితుడ నాగేష్ కత్తితో దాడి చేశాడు. హత్య అనంతరం మృతదేహాన్ని  ముగ్గురు నిందితులు తిరుమలరావుకు చూపించారు. దీంతో నిందితులకు తిరుమలరావు 2 లక్షలు పంపాడు. కేసులో కీలక సూత్రధారి తిరుమలరావు ఇంకా పరారీలోనే ఉన్నాడని ఎస్పీ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..