MIM: టార్గెట్ 2024.. ఆ నియోజకవర్గాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ నజర్.. కార్యకర్తలతో భేటీ
Asaduddin Owaisi: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలంటూ మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అక్రమాల వైపు వెళ్లినా.. పార్టీకి నష్టం కలిగించినా కార్యకర్తలపై చర్యలు
Asaduddin Owaisi: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలంటూ మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అక్రమాల వైపు వెళ్లినా.. పార్టీకి నష్టం కలిగించినా కార్యకర్తలపై చర్యలు తప్పవంటూ ఓవైసీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు అసదుద్దీన్ గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన ఎంఐఎం (AIMIM) ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ఇతర పార్టీల మాదిరిగా ఎన్నికల కోసం ప్రత్యేకంగా సిద్ధం కావడం లేదంటూ పేర్కొన్నారు. ఎన్నికలు ఒక నెల ముందు అనౌన్స్ చేసినా కూడా తాము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కార్యకర్తలకు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఓటర్ లిస్ట్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్న 7 నియోజకవర్గాలు మినహా… జుబ్లీహిల్స్, అంబర్‌పేట్, ముషీరాబాద్, సనత్‌నగర్ లతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాల్లో క్యాడర్ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
కార్యకర్తలు ఓటు ఉందో లేదో.. ఓటర్ లిస్ట్ ను చెక్ చేసుకోవాలని సూచించారు. ఓటర్ లిస్ట్ లో ఏమైనా తప్పులు ఉన్నా.. ఓటు మిస్ అయినా.. అధికారులకి లేకుంటే తమ పార్టీ కార్యాలయానికి సంప్రదించాలని సూచించారు. మజ్లీస్ నేతలు ఎవరైనా ఇళ్ల నిర్మాణాల విషయంలో అక్రమాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఓవైసీ హెచ్చరించారు. పాతబస్తీ మీరాలం మండీ నుంచి పలు కార్యకర్తలపైన వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి నోటీసు ఇచ్చి వారిని పిలిపించి వాళ్ళ పైన చర్యలు గట్టి చర్యలు తీసుకున్నామన్నారు. పార్టీకి ఇబ్బంది కలిగే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే సహించనంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. జాగ్రత్తగా మెలగాలంటూ కార్యకర్తలకు సూచించారు.
కాగా.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 15 సీట్లపై ఓవైసీ కన్నేసినట్లు ఈ మీటింగ్‌తో చెప్పకనే చెప్పారు.. కాగా.. ఎంఐఎం రంగంలోకి దిగితే ఎవరికీ లాభం ఎవరికీ నష్టం జరుగుతాయంటూ ఇతర రాజకీయ పార్టీలు అంచనాలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
-నూర్ మహ్మద్, టీవీ9 ప్రతినిధి, హైదరాబాద్
Also Read: