AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: ఇవాళ యాదాద్రికి సీఎం కేసీఆర్‌ దంపతులు.. పర్వతవర్ధి రామలింగేశ్వర ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ..

Yadagirigutta: ఇవాళ యాదాద్రికి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్‌ దంపతులు. రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఇవాల్టితో పంచకుండాత్మక మహాకుంభాభిషేకం ముగియనుంది. అనంతరం మహాకుంభ సంప్రోక్షణతో ఉద్ఘాటన మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొంటారు.

CM KCR: ఇవాళ యాదాద్రికి సీఎం కేసీఆర్‌ దంపతులు.. పర్వతవర్ధి రామలింగేశ్వర ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ..
Cm Kcr Couple
Sanjay Kasula
|

Updated on: Apr 25, 2022 | 8:45 AM

Share

ఇవాళ యాదాద్రికి(Yadagirigutta) వెళ్లనున్నారు సీఎం కేసీఆర్‌(CM KCR) దంపతులు. రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఇవాల్టితో పంచకుండాత్మక మహాకుంభాభిషేకం ముగియనుంది. అనంతరం మహాకుంభ సంప్రోక్షణతో ఉద్ఘాటన మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొంటారు. గత నెల 28న లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన, మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఇక శివాలయంలో ఈనెల 20 నుంచి మహాకుంభాభిషేకం ఉత్సవాలు జరుగుతున్నాయి. లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా నూతనంగా నిర్మించారు.

యాదాద్రి అభివృద్ధిలో భాగంగా కొండపై అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయ ఉద్ఘాటనకు స్మార్త ఆగమ శాస్త్రరీత్యా మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహణలో ఆచారపర్వాలు అయిదు రోజులుగా నిర్వహిస్తున్నారు. ఈరోజు జరగనున్న మహాక్రతువు ఉత్సవంలో సీఎం కేసీఆర్‌ పాల్గొనున్నారు. ఉద్ఘాటన పర్వాలు పూర్తయ్యాక పార్వతీ పరమేశ్వరుల నిజరూపాల దర్శనాలకు అవకాశం కల్పించనున్నారు.

ఆదివారం ఉదయం శివాలయం చెంత యాగశాలలో ద్వారతోరణం, శత రుద్రాభిషేకం, మహారుద్ర పురశ్చరణ, మూలమంత్రానుష్ఠానం, వేద హవనం, అధివాస హోమం నిర్వహించారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు రుద్ర హవనం, ప్రాసాద స్నపనం, కూర్మశిల, బ్రహ్మశిల, పిండికా స్థాపనం, శయ్యాధివాసం, పుష్పాధివాసంతోపాటు ప్రాసాదాధివాసం పర్వాలను శాస్త్రోక్తంగా కొనసాగించారు.

ఈ పర్వాలతో స్ఫటిక లింగ ప్రతిష్ఠాపన నిర్వహించనున్నారు. స్వర్ణ కలశాల ప్రతిష్ఠాపన, మహాకుంభాభిషేక మహోత్సవం సోమవారం నిర్వహించనున్నారు. రాంపురం ఆశ్రమ పీఠాధిపతులు మాధవానంద సరస్వతి స్వామి నేతృత్వంలో ఆయా విశిష్టపర్వాలు కొనసాగుతాయి. ఆదివారం యాదాద్రి క్షేత్ర సందర్శనకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరవడంతో సందడి నెలకొంది.

ఇవి కూడా చదవండి: Viral Video: ఈ కాకి చాలా క్లెవర్.. ఒక్క ఐడియాతో దాని ఇంటినే మార్చేసింది.. ఏం చేసిందో తెలుసా..

Viral Video: ఒక రోజు ముందే వధూవరుల మధ్య ఆ పోటీ.. గెలిచిందెవరో తెలిస్తే షాక్..