AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఒక రోజు ముందే వధూవరుల మధ్య ఆ పోటీ.. గెలిచిందెవరో తెలిస్తే షాక్..

ఈ మధ్య పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వీడియోలను నెటిజన్లు విపరీతంగా ఇష్టపడుతున్నారు. అయితే ఈ వీడియోలో మాత్రం..

Viral Video: ఒక రోజు ముందే వధూవరుల మధ్య ఆ పోటీ.. గెలిచిందెవరో తెలిస్తే షాక్..
Bride Groom
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 25, 2022 | 8:10 AM

ఈ మధ్య పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వీడియోలను నెటిజన్లు  విపరీతంగా ఇష్టపడుతున్నారు. పెళ్లిళ్ల వీడియోలు అప్‌లోడ్ చేసిన వెంటనే వేగంగా వైరల్(Viral Video) అవుతున్నాయి. ఇందులో వధూవరుల స్టైల్ అంటే చాలా ఇష్టం. అదే సమయంలో నేటి పెళ్లిళ్లలో, వధూవరులు కూడా తమ డిఫరెంట్ స్టైల్‌లో చాలా సందడి చేస్తూ కనిపిస్తారు. వధూవరులు తమ వివాహంలో ఒక ప్రత్యేకమైన రీతిలో గ్రాండ్ ఎంట్రీ తీసుకోవడం మీరు తరచుగా చూసి ఉంటారు. ఈ రోజుల్లో పెళ్లికి సంబంధించిన వీడియో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు. వీడియోలో, వధువు, వరుడు సరదాగా ఛాలెంజ్ దృశ్యాలను చూడచ్చు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఛాలెంజ్‌లో వధువు తన వరుడికి గట్టి పోటీ ఇస్తూ కనిపించింది. పెళ్లి వేదికపై వధువు వరుడితో కలిసి పుషప్స్ ఛాలెంజ్ చేస్తున్న వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

వేదికపై వధూవరులు ఉన్నట్టు వీడియోలో చూడవచ్చు. పెళ్లి కార్యక్రమం ఇంకా ముగియలేదు. అలాంటప్పుడు వధూవరుల మధ్య తెలిసో తెలియకో ఇద్దరికీ ఒక సవాలు ఎదురైంది. దీని తర్వాత పుషప్‌ల పరంపర మొదలవుతుంది. ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు పుష్‌అప్‌లు కొట్టడం మొదలు పెట్టారు. వరుడికి, ఇది బహుశా సులభమైన పనే.. ఎందుకంటే అబ్బాయిలు సాధారణంగా ప్రతిరోజూ ఈ రకమైన వ్యాయామం చేస్తారు. అయితే పెళ్లికూతురు కూడా ఇంత ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా మారుతుందని ఎవరూ ఊహించి ఉండరు.

వీడియో చూడండి- 

 

వధువు తన వరుడికి సమానంగా పోటీ ఇవ్వడం వీడియోలో మీరు చూడవచ్చు. అయితే, వీడియో పూర్తి కాలేదు. దీంతో వీరిద్దరిలో ఎవరు గెలిచారో తెలియడం లేదు. ఎవరు గెలిచినా ఆ వీడియో మాత్రం అందరి మనసులను దోచేస్తోంది. వధూవరుల ఈ ప్రత్యేకమైన స్టైల్‌ని పెళ్లికి వచ్చిన జనాలు కూడా ఇష్టపడ్డారు. ఈ వీడియో bridal_lehenga_designn అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయబడింది.

ఇవి కూడా చదవండి: Viral Video: ఈ కాకి చాలా క్లెవర్.. ఒక్క ఐడియాతో దాని ఇంటినే మార్చేసింది.. ఏం చేసిందో తెలుసా..

Lata Mangeshkar Award: దేశప్రజలకు లతామంగేష్కర్​అవార్డ్ అంకితం.. కీలక ప్రకటన చేసిన ప్రధాని మోడీ..