AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా.. ఆ సమయంలోనే శుభమూహుర్తం

వైశాఖ శుక్ల పక్షం తృతీయ తిథి నాడు అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ సారి మే 3న జరుపుకునే అక్షయ తృతీయ రోజున.. పొందిన పుణ్యాలు, ఫలాలు, ఐశ్వర్యం ఎన్నటికీ తరగవని నమ్మకం. అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి కొనుగోలుకు...

అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా.. ఆ సమయంలోనే శుభమూహుర్తం
Gold Jewellery
Ganesh Mudavath
|

Updated on: Apr 25, 2022 | 6:53 AM

Share

వైశాఖ శుక్ల పక్షం తృతీయ తిథి నాడు అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ సారి మే 3న జరుపుకునే అక్షయ తృతీయ రోజున.. పొందిన పుణ్యాలు, ఫలాలు, ఐశ్వర్యం ఎన్నటికీ తరగవని నమ్మకం. అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి కొనుగోలుకు అధిక ప్రాధాన్యం చూపిస్తారు. బ్రహ్మదేవుని కుమారుడు అక్షయ కుమారుడు ఈ తేదీన జన్మించాడు. అందుకే వైశాఖ శుక్ల తృతీయ తేదీని అక్షయ తృతీయ అంటారు. గంగా అవతరణ, పరశురామ జయంతి కూడా ఈ తేదీన జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువును పూజిస్తారు. అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేసిన ఆభరణాలు, బంగారం, వెండి మొదలైన వాటికి పూజలు చేస్తారు. తద్వారా వారి సంపద, ఆస్తిలో పునరుత్పాదక వృద్ధి ఉంటుంది. పంచాంగం ప్రకారం వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ తేదీ మే మూడో తేదీన ఉదయం 05:18 నుంచి ప్రారంభమవుతుంది. మే 4 ఉదయం 07:32 వరకు ఉంటుంది.

అక్షయ తృతీయ రోజు శుభకార్యాలకు చాలా మంచిది. ఆ రోజు కొత్త బట్టలు, ఆభరణాలు, ఇల్లు, కారు వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌తో సహా కొన్ని రాష్ట్రాల్లో అక్షయ తృతీయ నాడు బంగారం లేదా వెండిని కొనుగోలు చేసే సాంప్రదాయం ఉంది. కొద్ది మొత్తంలోనైనా ఈరోజు బంగారం కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపుతారు.

ఒకవేళ అక్షయ తృతీయ నాడు బంగారం కొనేంత స్తోమత లేకపోతే పెద్దగా చింతించాల్సిన పని లేదు. ఆరోజు చక్కగా భగవంతుడికి పూజ చేసి.. భగవంతుడిని స్మరిస్తూ ఉపవాసం చేయాలి. ఉపవాసం అనంతరం సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శ్రీ మహా విష్ణువు అనుగ్రహం కలిగి సకల సంపదలు సిద్ధిస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

 Viral Video: వెరైటీగా ట్రై చేశాడు.. అడ్డంగా బుక్కయ్యాడు.. వీర ప్రేమికుడికి షాక్ ఇచ్చిన పోలీసులు..

Kurnool: కర్నూలు జిల్లాలో కిలాడి దంపతులు.. చోర విద్యలో ప్రావీణ్యులు.. ఏమార్చి..