AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క పెన్ డ్రైవ్.. ఐపీఎస్ ప్రభాకర్ రావుకు చుక్కలు చూపిస్తుంది.. కూపీ లాగుతున్న సిట్!

ఫోన్ టాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆధారంగా ఒక పెన్ డ్రైవ్ మారడంతో దానిపైనే ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ మొత్తం కేంద్రీకృతమైంది. ఫోన్ టాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కీలక డేటా ఈ పెన్ డ్రైవ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో కేసు మరింత కీలక దశకు చేరుకుంది.

ఒక్క పెన్ డ్రైవ్.. ఐపీఎస్ ప్రభాకర్ రావుకు చుక్కలు చూపిస్తుంది.. కూపీ లాగుతున్న సిట్!
Telangana Phone Tapping Case
Vijay Saatha
| Edited By: |

Updated on: Dec 24, 2025 | 10:30 AM

Share

ఫోన్ టాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆధారంగా ఒక పెన్ డ్రైవ్ మారడంతో దానిపైనే ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ మొత్తం కేంద్రీకృతమైంది. ఫోన్ టాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కీలక డేటా ఈ పెన్ డ్రైవ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో కేసు మరింత కీలక దశకు చేరుకుంది.

ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్‌గా పనిచేసిన సమయంలో ఫోన్ టాపింగ్‌కు సంబంధించిన వివరాలను ఈ పెన్ డ్రైవ్‌లో స్టోర్ చేసినట్లు సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ పెన్ డ్రైవ్‌లో వందల సంఖ్యలో ఫోన్ నంబర్లు ఉండటంతో పాటు, వాటికి సంబంధించిన పూర్తి ప్రొఫైల్స్ కూడా భద్రపరచినట్టు అధికారులు గుర్తించారు.

పెన్ డ్రైవ్‌లో రాజకీయ నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, అలాగే హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన ఫోన్ నంబర్లు, ప్రోఫైల్స్ ఉన్నట్టు సిట్‌కు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ డేటా ఆధారంగానే ఎవరి ఫోన్లు టాపింగ్‌కు గురయ్యాయనే విషయాన్ని సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పెన్ డ్రైవ్‌లో ఉన్న సమాచారాన్ని ప్రభాకర్ రావు ముందుంచి, సిట్ అధికారులు విచారణ చేపడుతున్నారు. టాపింగ్ ఎలా జరిగింది, ఎవరి ఆదేశాల మేరకు ఈ డేటా సేకరించబడిందన్న అంశాలపై లోతైన ప్రశ్నలు వేస్తున్నట్లు సమాచారం.

ప్రభాకర్ రావు టీమ్ ఫోన్ టాపింగ్‌కు సంబంధించిన అనేక ఆధారాలను నాశనం చేసినప్పటికీ, ఈ పెన్ డ్రైవ్‌ను మాత్రం సిట్ స్వాధీనం చేసుకోవడం కేసులో కీలక పరిణామంగా మారింది. కేసును నిరూపించేందుకు ఈ పెన్ డ్రైవ్ బలమైన సాక్ష్యంగా ఉపయోగపడుతుందని సిట్ అధికారులు భావిస్తున్నారు. మూడు రోజుల పాటు ప్రభాకర్ రావు విచారించి, అతని నుంచి పూర్తి వివరాలు, స్పష్టమైన వివరణలను సేకరించేందుకు సిట్ సిద్ధమైంది. ఈ పెన్ డ్రైవ్ ఆధారంగా ఫోన్ టాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!