AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SS Thaman: బన్నీ సినిమాలో కొంచెం ఉంటే అది బూతు పాట అయిపోయేది.. ఓపెన్‌గా చెప్పిన థమన్

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎస్.పి.బి, సిరివెన్నెల లేని లోటును ప్రస్తావించాడు. వారిద్దరూ ఇండస్ట్రీకి సీట్ బెల్ట్స్ లాంటివారని.. ప్రతీ పాటలోనూ స్వచ్చమైన భాష ఉండేలా చూసుకునేవారని తెలిపాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

SS Thaman: బన్నీ సినిమాలో కొంచెం ఉంటే అది బూతు పాట అయిపోయేది.. ఓపెన్‌గా చెప్పిన థమన్
Thaman
Ravi Kiran
|

Updated on: Jan 17, 2026 | 8:05 PM

Share

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎస్.పి.బి, సిరివెన్నెల లాంటి దిగ్గజాల మరణం ఇండస్ట్రీకి తీరని లోటని అతడు పేర్కొన్నాడు. వారిద్దరూ సీట్ బెల్ట్స్ లాంటివారని, వేగంగా వెళ్లే కారుకు సీట్ బెల్ట్ ఎలాగో, ఇండస్ట్రీకి వారు అలాంటి భద్రత, ప్రమాణాలను అందించారని థమన్ అన్నాడు. వారిద్దరి ఫోటోలు తన స్టూడియోలో ఎల్లప్పుడూ ఉంటాయని, వాటి మధ్యలో ‘నిరంతరంగా’ అనే పదాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ సూచించారని తెలిపాడు.

ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో

బాలు, సీతారామశాస్త్రి ఉన్నంత వరకు ఇండస్ట్రీలో ఒక భయం, అలర్ట్‌నెస్, శ్రద్ధ ఉండేవని థమన్ వివరించాడు. ఉదాహరణకు.. అల వైకుంఠపురంలోని ఒక పాట బూతు పాటగా మారేదని.. సీతారామశాస్త్రి దానికి మంచి లిరిక్స్ ఇచ్చి.. ఆ పాటకు గౌరవాన్ని తీసుకొచ్చారని చెప్పాడు. అలాగే, ఎస్‌పిబి తన చివరి పాటైన ‘నువ్వు నాతో ఏమన్నావో'(డిస్కో రాజా సినిమాలోనిది) ఆరు నిమిషాల పాటను 23 నిమిషాల్లో పాడి వెళ్ళిపోయారని.. 70 వేల పాటలు పాడినా సీతారామశాస్త్రికి ఫోన్ చేసి, లిరిక్స్ ఎలా పలకాలో సలహా అడిగిన బాలు వినయాన్ని థమన్ కొనియాడాడు. అది ఎంత గొప్ప మర్యాదో, అలాంటి వాతావరణం ఇప్పుడు ఇండస్ట్రీలో కరువైందని థమన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఇండస్ట్రీలో సింగర్ల రెమ్యూనరేషన్ విషయంలో మార్పులు జరిగాయని, గతంలో బాలు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేవారని, ఇప్పుడు లక్షల్లో రెమ్యూనరేషన్, జీఎస్టీలు అంటూ కొత్త పద్ధతులు వచ్చాయని చెప్పాడు. ఇండస్ట్రీలో టాక్సిక్ వాతావరణం పెరిగిందని, బ్యాక్ స్టాబింగ్, బ్యాక్ టాకింగ్స్ లాంటివి ఎక్కువయ్యాయని థమన్ పేర్కొన్నాడు. స్వార్థం పెరిగిపోయిందని.. ఒకరు రెమ్యూనరేషన్ మాట్లాడితే, మరొకరు తక్కువకు ఒప్పేసుకోవడం లాంటివి జరుగుతున్నాయని అన్నాడు.

తెలుగు ఇండస్ట్రీలో ఇతర భాషల మ్యూజిక్ డైరెక్టర్లకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని.. ఉదాహరణకు అనిరుధ్‌కి తెలుగులో సినిమా దొరకడం సులభమని, కానీ తనకు తమిళంలో సినిమా దొరకడం కష్టమని చెప్పుకొచ్చాడు. అయితే, తాను పోటీని పాజిటివ్‌గానే తీసుకుంటానని, కొత్తవారు వస్తే వారి స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నిస్తానని, వేరొక డైరెక్టర్ అనిరుధ్ లేదా దేవి వంటి వారి రిఫరెన్స్ ఇస్తే తాను బాధపడనని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటానని థమన్ స్పష్టం చేశాడు.

ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!