AP-TS Water Disputes: ఆంధ్రప్రదేశ్-తెలంగాణ జలవివాదం.. నాగార్జునసాగర్ డ్యామ్‌పై భారీగా మోహరించిన పోలీసులు..
AP-TS Water Disputes: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఆర్డీఎస్ ప్రాజెక్టు విస్తరణతో..
AP-TS Water Disputes: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఆర్డీఎస్ ప్రాజెక్టు విస్తరణతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు నాగార్జున సాగర్ వరకు పాకింది. ఈ వివాదం నేపథ్యంలోనే నాగార్జునసాగర్ డ్యామ్‌పై భారీగా పోలీసులు మోహరించారు. సాగర్ మెయిన్ డ్యామ్‌తో పాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా, ఈ బందోబస్తును డీఐజీ ఏవీ రంగనాథ్ స్వయంగా పరిశీలించారు. కృష్ణా జలాల వినియోగంపై కృష్ణా రివర్ బోర్డుకు ఏపీ సర్కార్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నాగార్జున సాగర్ డ్యాం పై భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు శ్రీశైలం, నాగార్జునసాగర్ విద్యుత్ కేంద్రాల్లో వంద శాతం విద్యుత్ ఉత్పత్తి చేయాలంటూ తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. నాగార్జున సాగర్ పవర్ ప్లాంట్.. 815 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. కాగా, ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో నాగార్జునసాగర్ లో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తికి జెన్ కో సన్నాహాలు చేస్తోంది.
Also read: