Andhra Pradesh: వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీల్లో గడువు ముగిసిన ప్రత్యేక అధికారుల గడువును పొడిగిస్తూ జీవో పాస్ చేసింది. రాష్ట్రంలోని 10 పురపాలికల్లో..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీల్లో గడువు ముగిసిన ప్రత్యేక అధికారుల గడువును పొడిగిస్తూ జీవో పాస్ చేసింది. రాష్ట్రంలోని 10 పురపాలికల్లో ప్రత్యేకాధికారుల గడువును రెన్యువల్ చేస్తున్న ప్రకటించిన సర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీల్లో స్పెషల్ ఆఫీసర్ల గడువును 2023 మే5 వరకు పొడిగించింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే వరకూ ఇదే ఆఫీసర్లు కంటిన్యూ అవుతారని జీవోలో తెలిపింది. రాష్ట్రంలో రాజమహేంద్రవరం సహా మరో తొమ్మిది మున్సిపాలిటీలకు చెందిన స్పెషల్ ఆఫీసర్ల గడువును పొడిగించారు.
రాజమహేంద్రవరం, రాజాం, భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, గుడివాడ, బాపట్ల, గూడూరు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీలకు సంబంధించి ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీల్లో స్పెషల్ ఆఫీసర్లను ఇదే ఏడాది మే 6వ తేదీన నియమించింది ప్రభుత్వం. ఈనెల 5వ తేదీతో వారి గడువు ముగిసింది.
స్పెషల్ ఆఫీసర్లను కంటిన్యూ చేయ్యాలా? వద్దా? అనే దానిపై ప్రభుత్వం సమీక్ష చేసి.. వారిని వచ్చే ఏడాది ఎన్నికల వరకు కంటిన్యూ చేయాలని నిర్ణయించింది. దీంతో వెలగపూడిలోని సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి జీవో పాస్ చేశారు. దీంతో ఇవాళ్టి నుంచే 10 మున్సిపాలిటీలకు చెందిన స్పెషల్ ఆఫీసర్ల విధులు అమలులోకి వచ్చాయి.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
