Krishna Board: శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణపై కీలక నిర్ణయం..

బోర్డ్‌ సమావేశం అనంతరం ఏపీఈఎన్‌సీ నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోర్డు పరిధిలో మొత్తం 15 కాంపోనెంట్స్‌లో 9 తెలంగాణ, 6 ఆంధ్రప్రదేశ్‌వి ఉన్నాయని, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత పై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు...

Krishna Board: శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణపై కీలక నిర్ణయం..
KRMB
Follow us
Sravan Kumar B

| Edited By: Narender Vaitla

Updated on: Feb 01, 2024 | 7:59 PM

శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణపై గురువారం జలసౌధాలో కృష్ణా బోర్డ్ మీటింగ్ జరిగింది. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం నాగార్జునసాగర్ లను బోర్డుకు అప్పగింతపై ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాల నుంచి కార్పస్ ఫండ్ నిధుల విడుదలపై సమావేశంలో చర్చ జరిగింది. ఇందులో భాగంగా.. కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల నిర్వహణకు ఏపీ, తెలంగాణ అంగీకారం తెలిపాయి.

బోర్డ్‌ సమావేశం అనంతరం ఏపీఈఎన్‌సీ నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోర్డు పరిధిలో మొత్తం 15 కాంపోనెంట్స్‌లో 9 తెలంగాణ, 6 ఆంధ్రప్రదేశ్‌వి ఉన్నాయని, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత పై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. ఇందుకోసం ఇరు రాష్ట్రాల నుంచి ఉద్యోగుల కేటాయింపు ఉంటుందన్నారు. నీటి కేటాయింపులపై త్రిసభ్య కమిటీ దే తుది నిర్ణయం ఉంటుందని చెప్పుకొచ్చారు. లెఫ్ట్ మెన్ కెనాల్ నుంచి రెండు టీఎంసీ, మార్చిలో రైట్ మెన్ కెనాల్ నుంచి మూడు టీఎంసీలు ఏపీకి విడుదలకు ఒప్పుకున్నారని తెలిపారు. ప్రాజెక్టుల ఆపరేషన్‌ కోసం తెలంగాణ ఒప్పుకుందని నారాయణరెడ్డి తెలిపారు.

ఇక తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ మాట్లాడుతూ.. ప్రాజెక్టుల ఆపరేటింగ్ అంతా కృష్ణ రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ ఇచ్చామని, పవర్‌ స్టేషన్స్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నాగార్జున సాగర్ తెలంగాణ, శ్రీశైలం ఏపీ చూసుకుంటుంది. ఇకపై ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలో నడుస్తాయన్నారు. తమ డిమాండ్స్‌ అన్ని కేంద్రానికి లేఖలు రాశామని, కేంద్రం నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదని చెప్పుకొచ్చారు. నీటి వాటాల పంపకంపై త్రిసభ్య కమిటీనే నిర్ణయం తీసుకుంటుందని, ప్రాజెక్టుల వద్ద భద్రత పరిస్థితిని బట్టి బోర్డు కనుసన్నల్లో జరుగుతుందని మురళీధర్‌ చెప్పుకొచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..