AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌ను బెంబేలెత్తిస్తున్న హిట్ అండ్‌ రన్‌ కేసులు.. నెల రోజుల్లో ఏకంగా..!

హైదరాబాద్‌లో నమోదవుతున్న హిట్ అండ్ రన్ కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. మరి ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో హిట్ అండ్ రన్‌ కేసులు ఎక్కువ నమోదయ్యాయి. ఇటీవల హైదరాబాద్‌లో నమోదైన వరుస హిట్ అండ్ రన్ కేసుల్లో పలువురు మృత్యువాత పడ్డారు.

Hyderabad: హైదరాబాద్‌ను బెంబేలెత్తిస్తున్న హిట్ అండ్‌ రన్‌ కేసులు.. నెల రోజుల్లో ఏకంగా..!
Representative Image
Ravi Kiran
|

Updated on: Feb 01, 2024 | 8:00 PM

Share

హైదరాబాద్‌లో నమోదవుతున్న హిట్ అండ్ రన్ కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. మరి ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో హిట్ అండ్ రన్‌ కేసులు ఎక్కువ నమోదయ్యాయి. ఇటీవల హైదరాబాద్‌లో నమోదైన వరుస హిట్ అండ్ రన్ కేసుల్లో పలువురు మృత్యువాత పడ్డారు. యాక్సిడెంట్స్ చేసిన వ్యక్తులపై పోలీసులు మర్డర్ కేస్ నమోదు చేశారు.

తాజాగా జూబ్లీహిల్స్ పరిధిలో మరో ఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో వేగంగా దూసుకొచ్చిన స్పోర్ట్స్ కార్‌.. రెండు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణానగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు బైక్‌పైన వెళ్తున్న అన్నా చెల్లెలు ఉదయ్, సుష్మాలను వెనుక నుండి స్పోర్ట్స్ కార్ ఢీ కొట్టింది. ఈ కేసులో నిందితులు ఐడెంటిఫై కాలేదు. సీసీటీవీ ఫుటేజ్‌లో కార్ నంబర్‌ గుర్తించారు పోలీసులు. AP 07CY 3113 నంబర్ గల కారు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తులదిగా నిర్ధారించారు. నిందితులను పట్టుకునేందుకు గుంటూరు జిల్లా కాటమూరుకి వెళ్లింది జూబ్లీహిల్స్ పోలీసుల బృందం. గాయపడ్డ బాధితులు మాదాపూర్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

అంతకుముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి సమీపంలో డ్యూటీ ముగించుకుని బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను వెర్నా కారు ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు ఆపకుండా పటాన్‌చెరువు వైపు వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో బౌన్సర్‌గా పనిచేసే తారక్ అనే యువకుడు స్పాట్‌లోనే చనిపోయాడు. మరో యువకుడు రాజు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసిన పోలీసులు.. గంట వ్యవధిలోనే సీసీ ఫుటేజ్‌ సాయంతో కారు నెంబర్ గుర్తించి.. నిందితుడు రిత్విక్ రెడ్డితో పాటు కారులో ప్రయాణించిన మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మద్యం మత్తులో యాక్సిడెంట్ చేసినట్లు నిర్ధారించారు పోలీసులు.

ఇదిలా ఉండగానే.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. సాప్ట్‌వేర్ ఉద్యోగి వాహనం నడుపుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేసే సిబ్బందిని ఢీకొట్టాడు. కారు ఆపకుండా పరారయ్యాడు. ఇతనిపై కూడా హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదు చేశారు పోలీసులు. VIP జోన్‌‌లలోనే హిట్ అండ్ రన్ కేసులు నమోదవుతున్నాయి. ప్రమాదం చేసి పరారవుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు సీసీటీవి ఆధారంగానే దర్యాప్తు చేయాల్సి వస్తుంది. ఈ కేసుల్లో ఎక్కువ మంది నిందితులు బడా బాబుల పిల్లలే ఉండటంతో సీరియస్ యాక్షన్‌ తీసుకుంటున్నారు పోలీసులు. ఈ ఘటనలకు పాల్పడుతున్న పుత్ర రత్నాల తల్లిదండ్రులను స్టేషన్‌కి పిలిపించి కౌన్సింగ్‌ ఇస్తున్నారు.

Follow Us
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్