Viral Video: అటు ఉపాధి.. ఇటు నలుగురికి ఉపయోగం.. ఓ నిరుద్యోగి వినూత్న ఆలోచన..
ఇప్పటి వరకు మొబైల్ టిఫిన్ సెంటర్లు చూశాం.. మొబైల్ టీ స్టాల్లు కూడా చూశాం కానీ ఇప్పుడు మొబైల్ జిరాక్స్ , ఆన్ లైన్ సెంటర్ కూడా అందుబాటులోకి తెచ్చారు ఖమ్మం యువకుడు. ఖమ్మం నగరంలోని సుందరయ్య నగర్‌కు చెందిన పోలా నరసింహ రావు అనే యువకుడు బీకాం చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేశారు.

ఇప్పటి వరకు మొబైల్ టిఫిన్ సెంటర్లు చూశాం.. మొబైల్ టీ స్టాల్లు కూడా చూశాం కానీ ఇప్పుడు మొబైల్ జిరాక్స్ , ఆన్ లైన్ సెంటర్ కూడా అందుబాటులోకి తెచ్చారు ఖమ్మం యువకుడు. ఖమ్మం నగరంలోని సుందరయ్య నగర్‌కు చెందిన పోలా నరసింహ రావు అనే యువకుడు బీకాం చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేశారు. చివరకు తాను ఆశించిన ఉద్యోగం దొరక్కపోవడంతో నిరుత్సాహపడకుండా తనకు వచ్చిన ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చారు. తాను కిరాయికి ఉండే ఇంటి ఓనర్స్కు చెప్పి వాళ్ల సహకారంతో మొబైల్ జిరాక్స్ సెంటర్ పెట్టారు.
తమ పాత కారును నరసింహ రావుకు ఫ్రీగా ఇచ్చి అతనిని ప్రోత్సహించారు ఇంటి ఓనర్. ఆన్ లైన్ సర్వీస్‌కు అవసరమైన ల్యాప్ ట్యాప్, బ్యాటరీ, జిరాక్స్ మెషిన్లు ఇన్స్టాల్ మెంట్లో తీసుకొని ఆ పాత కారులోనే ఆన్ లైన్ సర్వీస్ సెంటర్ నడుపుతున్నారు యువకుడు. నగరంలోని పాస్ పోర్ట్ ఆఫీస్ ముందు కార్ పెట్టుకొని అక్కడికి వచ్చే వారికి సేవలు అందిస్తున్నారు. సొంత కాళ్ళ మీద నిలబడే మా లాంటి నిరుద్యోగులను ప్రోత్సహించాలనీ అంటున్నారు. ఉద్యోగం దొరక్క పోయిన నిరుత్సాహపడకుండా కొత్త ఆలోచనతో సంపాదించుకుంటు నలుగురికి ఉపయోగపడుతున్న యువకుడి ఆలోచనకు స్థానికులు అభినందిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




