Ambedkar Open University: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షల తేదీలు ఖరారు.. ఎప్పటి నుంచంటే..
Ambedkar Open University: తెలంగాణ రాష్ట్రానికి చెందిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. యూనివర్సిటీ పరిధిలో జరిగే పరీక్షలకుగాను అధికారులు తేదీలను అధికారికంగా ప్రకటించారు...
Ambedkar Open University: తెలంగాణ రాష్ట్రానికి చెందిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. యూనివర్సిటీ పరిధిలో జరిగే పరీక్షలకుగాను అధికారులు తేదీలను అధికారికంగా ప్రకటించారు. నిజానికి ఈ పరీక్షలను మార్చి 21న మొదలు పెట్టి ఏప్రిల్‌లో ముగించాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో తాజాగా మారిన తేదీలను ప్రకటించారు. ఈ క్రమంలోనే డిగ్రీ (సీబీసీఎస్ ) 4వ సెమిస్టర్ ఎగ్జామ్స్ జులై 6 నుంచి 8వ తేదీ వరకు, డిగ్రీ 2వ సెమిస్టర్ పరీక్షలను జులై 9 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రకటన చేశారు. మూడేళ్ల డిగ్రీ కోర్సు పాత బ్యాచ్‌ల పరీక్షలను జులై 16 నుంచి ఆగస్టు 1 వరకు నిర్వహించనున్నారు. ఇక బీఎడ్ ( స్పెషల్ ఎడ్యుకేషన్ ) ప్రవేశ పరీక్షను జులై 18న, ఎంబీఏ ( హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్) పరీక్షను జులై 16 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరుకావడం కసం రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు.. యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇతర వివరాల కోసం www.braouonline.in వెబ్‌సైట్‌ను చూడండి.
Drowning: కామారెడ్డి జిల్లాలో విషాదం.. మంజీరా నదిలో నలుగురు గల్లంతు.. ముగ్గురు మృతి..
Delta Plus variant: వణికిస్తున్న డెల్టా వేరియంట్.. తమిళనాడులో తొలి మరణం నమోదు..