Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghost Caught on Camera: ఎవరూ లేరని ఆ ఇంట్లోకి వెళ్లారు.. ఊహించని షాక్‌తో వెనుదిరిగారు.. షాకింగ్ వీడియో మీకోసం..

Real Ghost caught on camera: దెయ్యాన్ని చూశారా అంటే కొందరు చూశామంటారు.. మరికొందరు చూడలేదంటారు.. ఇంకొందరైతే ఏమాట్లాడుతున్నారు..

Ghost Caught on Camera: ఎవరూ లేరని ఆ ఇంట్లోకి వెళ్లారు.. ఊహించని షాక్‌తో వెనుదిరిగారు.. షాకింగ్ వీడియో మీకోసం..
Devil
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 26, 2021 | 6:14 PM

Real Ghost caught on camera: దెయ్యాన్ని చూశారా అంటే కొందరు చూశామంటారు.. మరికొందరు చూడలేదంటారు.. ఇంకొందరైతే ఏమాట్లాడుతున్నారు బాస్, ఈ కాలంలో దెయ్యాలు, భూతాలు ఏంటి అంటూ పై నుంచి కింద వరకు పిచ్చోళ్లను చూసినట్లు చూస్తారు. అయితే, కొందరు దెయ్యాలు ఉన్నాయని నిరూపించేందుకు చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం వారు కెమెరాలు పట్టుకుని వెతకని ప్రదేశాలంటూ ఉండవు. పురాతన భవనాలు, నిర్మానుష్య ప్రాంతాలు, స్మశనాలు లక్ష్యంగా వీరి అన్వేషణ సాగిస్తుంటారు. ఇప్పటికే సోషల్ మీడియాలో దెయ్యానికి సంబంధించి అనేక వీడియోలు ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో తెగ సర్క్యూలేట్ అవుతోంది. శిథిలావస్థలో ఉన్న ఓ భవనంలో దెయ్యం కదలికలు ఉన్నట్లు ఈ వీడియోలో స్పష్టమవుతోంది.

ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ముందుగా పురాతన భవనంలోకి వెళ్తారు. అలా వెళ్లడం వెళ్లడంతోనే వారు కెమెరా ఆన్ చేసి పెడతారు. గదిలోకి ప్రవేశించి అంతా కలియదిరుగుతారు. ఆ తరువాత మెట్లగుండా పైకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పైన మెట్లపై ఒకరకమైన అలజడి వినిపిస్తుంది. దాంతో షాక్ అయిన వారు.. కెమెరాను మెట్లపైకి పెట్టగా.. అక్కడ ఒక వ్యక్తి తచ్చాడుతూ కనిపిస్తుంటుంది. మనిషి ఆకారంలో నల్లటి నీడ అటూ ఇటూ నడస్తున్నట్లుగా ఆ వీడియోలో కనిపిస్తుంది. వారిద్దరూ ఎవరున్నారంటూ శబ్ధం చేయగా.. ఆ నల్లటి నీడ అక్కడి నుంచి వెళ్లిపోయింది. దాంతో వారు కూడా దానిని వెంబడించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అక్కడ ఎవరూ కనిపించలేదు. ఆ నీడ దెయ్యం నీడ అని ఆ వీడియోలోని వ్యక్తులు ఘంటాపథంగా నొక్కి చెబుతున్నారు.

కాగా, కెమెరాలో బంధించిన ఈ దెయ్యం వీడియోను బ్రిటీష్ వార్తాపత్రి ‘ది సన్’ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. అంతేకాదు.. ‘భయంకరమైన క్షణం.. పురాతన భవనంలో సంచరిస్తున్న దెయ్యం. కెమెరా కంటికి చిక్కింది’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటి లక్షకు పైగా మంది వీక్షించారు.

Viral Video:

Also read:

sarkaru vaari paata: “సర్కారు వారి పాట” మూవీ షూటింగ్ కు సిద్దమవుతున్న సూపర్ స్టార్..