Hyderabad: నగరంలో వీధి కుక్కల దాడులపై అసెంబ్లీలో స్పందించిన అక్బరుద్దీన్ ఒవైసీ..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హైదరాబాద్‌లో వీధికుక్కల దాడి అంశాన్ని లేవనెత్తారు ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ. ఆయన ప్రసంగిస్తూ, “హైదరాబాద్‌లో కొత్త జాతి కుక్కలు కనిపిస్తున్నాయి. అవి ప్రజలపై దాడి చేస్తున్నాయన్నారు.” నగరంలో వీధికుక్కల దాడి వల్ల చిన్నారులు చనిపోతున్నారని, వాటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఒవైసీ కోరారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హైదరాబాద్‌లో వీధికుక్కల దాడి అంశాన్ని లేవనెత్తారు ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ. ఆయన ప్రసంగిస్తూ, “హైదరాబాద్‌లో కొత్త జాతి కుక్కలు కనిపిస్తున్నాయి. అవి ప్రజలపై దాడి చేస్తున్నాయన్నారు.” నగరంలో వీధికుక్కల దాడి వల్ల చిన్నారులు చనిపోతున్నారని, వాటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఒవైసీ కోరారు. నగరంలోని పలు ఘటనల తర్వాత అక్బరుద్దీన్ ఒవైసీ ఈ ప్రకటన చేయడం మరోసారి చర్చనీయాంశమైంది. తాజాగా శంషాబాద్‌లో ఏడాదిన్నర చిన్నారిని వీధికుక్కలు కొరికి చంపాయన్నారు. గత నెలలో, మణికొండ శ్రీనివాసనగర్ కాలనీలో మరో సంఘటన జరిగిందని గుర్తు చేశారు. తన తల్లితో కలిసి కిరాణా షాపుకు వెళ్లిన ఒక పిల్లవాడిని వీధికుక్కలు గాయపరచాయన్నారు. డిసెంబరులో, దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన ప్రత్యేక సంఘటనలో ఒక బాలుడు వీధికుక్క దాడితో తీవ్రంగా గాయపడ్డాడని వివరించారు.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వీధికుక్కల దాడి నేపథ్యంలో అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వం హైదరాబాద్‌లో వీధికుక్కల దాడులను తక్షణమే నిరోధించాలన్నారు. నగరంలో పలుమార్లు వీధికుక్కల దాడులు జరుగుతున్నా సమస్య పరిష్కారానికి పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో వీధికుక్కల సంఖ్య పెరుగుతూ.. నివాసితులకు ముప్పు కలిగిస్తోందని వివరించారు. వేసవి కాలం సమీపిస్తున్నందున, పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా కుక్కలు మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని, ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరుగకుండా ముందుగానే నివారించడానికి సంబంధిత అధికారులు శరవేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
Addressed Concerns About #Dog Bites 🐕 In #Hyderabad Today In #Telangana #Assembly, Urging Swift Action. pic.twitter.com/0ZMW0F0GXE
— Akbaruddin Owaisi (@AkbarOwaisi_MIM) February 14, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








