Telangana: వార్నీ వీడెవడ్రా బాబూ..! పొలాల్లోని పంటనే ఎత్తుకెళ్లాడు.. లబోదిబోమంటున్న రైతు
కుక్కపిల్ల.. సబ్బు బిళ్ల.. అగ్గిపుల్ల కావేవీ కవితకు అనర్హమన్నాడు శ్రీ శ్రీ. బట్టైనా.. బుట్టైనా.. బంగారమైనా దొంగతనానికి అర్హమైనవే అంటున్నారు ఆ దొంగలు. అలా ఎవరూ ఊహించని రీతిలో వెల్లుల్లిపాయల దొంగతనం చేసి అందరినీ నివ్వెరపర్చారు ఆ దొంగనాయళ్లు. ఆ ఘటన తాలూకు ఆ డ్రామాటిక్ కథ తెలుసుకోవాలంటే ఓసారి కరీంనగర్ జిల్లా వరకూ వెళ్లొద్దాం పదండి.

గుండవేని శంకర్ అనే రైతు శంకరపట్నం మండలంలోని తన సొంతూరు కన్నాపూర్‌లోని తన వ్యవసాయ భూమి వద్ద వెల్లుల్లి మడులు వేసుకున్నాడు. ఎవరో తెలిసినవాళ్లు శంకర్ పొలం వద్దకు వెళ్లారు. కానీ, అంతకుముందు ఏపుగా వెల్లిపాయలతో కనిపించిన శంకర్ పొలం బోసిపోయి కనిపించింది. పొలం మాత్రమే ఉందిగానీ, ఏపుగా కాసిన వెల్లిపాయలు మాయమయ్యాయి. దీంతో ఆ విషయాన్ని శంకర్ కు తెలియపర్చారు. అలాంటి అనుభవం ఎప్పుడూ ఎదుర్కోని శంకర్.. అవాక్కయ్యాడు. ఆ తర్వాత పొలం వద్దకు వెళ్లేసరికి వెల్లుల్లి మడులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కోసుకుని వెళ్లిపోవడంతో లబోదిబోమన్నాడు. వెల్లుల్లి మడులన్నీ ఖాళీ అయి, ఉట్టి వ్యవసాయ పొలం మాత్రమే మిగిలింది. తనకు 40 వేల రూపాయల నష్టం వాటిల్లిందంటూ ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు శంకర్.
స్థానిక కేశవపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన రైతు శంకర్.. తనకు న్యాయం జరిగేలా చూసి నష్టపరిహారమైనా వచ్చేలా చూడండంటూ ప్రాధేయపడుతున్నాడు. మరోవైపు, పొలాల్లో ధాన్యాన్నీ, పండ్లతోటలను, కూరగాయలను కూడా దోచే దొంగలు తయారవ్వడంతో.. ఇప్పుడు మిగిలిన రైతులూ శంకర్ లాంటి పరిస్థితి తమకూ వస్తే ఎలా అనే ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…