ఫేర్వెల్ పార్టీలో ఆనందంగా కనిపించి.. సాయంత్రం కూల్ డ్రింక్ తాగి.. కట్ చేస్తే
విద్యా సంవత్సరం ముగుస్తున్న సమయంలో కాలేజీల్లో ఫేర్వెల్ పార్టీలు జరుగుతుంటాయి. ఆలాంటి ఫేర్వెల్ పార్టీలో ఉత్సాహంగా పాల్గొన్న ఓ విద్యార్థినీ రాత్రి హాస్టల్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సూర్యాపేట పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన వెంకన్న, భాగ్యమ్మ దంపతులు కుతూరు వైష్ణవి ఇమాంపేట గురుకులంలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు.

విద్యా సంవత్సరం ముగుస్తున్న సమయంలో కాలేజీల్లో ఫేర్వెల్ పార్టీలు జరుగుతుంటాయి. ఆలాంటి ఫేర్వెల్ పార్టీలో ఉత్సాహంగా పాల్గొన్న ఓ విద్యార్థినీ రాత్రి హాస్టల్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సూర్యాపేట పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన వెంకన్న, భాగ్యమ్మ దంపతులు కుతూరు వైష్ణవి ఇమాంపేట గురుకులంలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. విద్యా సంవత్సరం ముగుస్తుండడంతో పాఠశాల యాజమాన్యం శనివారం ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు.
ఈ ఫేర్వెల్ పార్టీ కోసం సూర్యాపేట నుంచి ఉదయం తండ్రి వెంకన్న ఫోన్ చేసి, పూలు, డ్రెస్‌లు ఇచ్చి వెళ్ళారు. మధ్యాహ్నం ఫేర్వెల్ పార్టీలో ఉత్సాహంగా పాల్గొన్ననని వీడియో కాల్ చేసి చెప్పారు వైష్ణవి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ రాత్రి 9:30 ప్రాంతంలో విద్యార్థులంతా బయట కూర్చుని కూల్ డ్రింక్ తాగుతున్న సమయంలో రూముకు వెళ్ళిన వైష్ణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో హాస్టల్ వార్డెన్ విద్యార్థిని తల్లిదండ్రులకు ఫోన్ చేసి వైష్ణవి ఆరోగ్యం బాగాలేదని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని’ సూచించారు. ఐదు నిమిషాల తర్వాత మళ్లీ ఫోన్ చేసి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని త్వరగా రావాలని కోరారు. తాము ఆసుపత్రికి వెళ్ళేసరికే కుమార్తె మరణించిందని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
సీన్ కట్ చేస్తే తమ కూతురిని చూసిన తల్లిదండ్రులు అమ్మాయి ఫ్రెషర్స్ డే వేడుకల్లో సరదాగా గడిపిందని, అక్కణ్నుంచే వీడియో కాల్ చేసి మాతో మాట్లాడిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. హాస్టల్ లో ఫుడ్ విషయంలో వైష్ణవి ప్రశ్నించినందుకే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. బాలిక మృతిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వైష్ణవి మృతిపై నిజనిర్ధారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని గురుకుల పాఠశాల ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు వైష్ణవి కుటుంబసభ్యులు. సూర్యాపేట జాతీయ రహదారి పై రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వారం రోజుల క్రితం భువనగిరి ఎస్సీ హాస్టల్లో ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరిచిపోకముందే ఇలా జరగడం కలకలం రేపుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..