పరమభక్తుడికి ధ్యాన మందిర నిర్మాణంపై జాప్యం ప్రదర్శిస్తున్న ఆధికారులు..
వాగ్గేయకారుడు, పరమ భక్తాగ్రేసరుడు రామదాసు. శ్రీ భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం నిర్మాత భక్తరామదాసు (కంచర్ల గోపన్న) నేలకొండపల్లికి చెందిన వారు . రామదాసు ఉద్యోగం రీత్యా భద్రాచలం వెళ్లి ఆలయంను నిర్మించారు. ఆయన జయంతి ఉత్సవాలు ఈనెల 12.13.14 తేదీల్లో నెలకొండపల్లిలోని భక్త రామదాసు జ్ఞాన మందిరంలో నిర్వహించనున్నారు.
వాగ్గేయకారుడు, పరమ భక్తాగ్రేసరుడు రామదాసు. శ్రీ భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం నిర్మాత భక్తరామదాసు (కంచర్ల గోపన్న) నేలకొండపల్లికి చెందిన వారు . రామదాసు ఉద్యోగం రీత్యా భద్రాచలం వెళ్లి ఆలయంను నిర్మించారు. ఆయన జయంతి ఉత్సవాలు ఈనెల 12.13.14 తేదీల్లో నెలకొండపల్లిలోని భక్త రామదాసు జ్ఞాన మందిరంలో నిర్వహించనున్నారు. ఎన్నో కష్టాలు అనుభవించి భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని నిర్మించిన కంచర్ల గోపన్నకు తగిన ఆదరణ లేకుండా పోయింది. ఆయన జన్మస్థలంలో జన్మస్థలంలో రామదాసు ధ్యాన మందిరానికి తగిన ప్రాధాన్యం లేక పోవడంతో విచారం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఆయన జయంతి ఉత్సవాలను భద్రాచలం దేవస్థానం వారు పట్టించుకోని ఘనంగా నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. నామ మాత్రంగా నిర్వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఉన్న భక్త రామదాసు ధ్యాన మందిరాన్ని భక్తుల విజ్ఞప్తి మేరకు 2000 సంవత్సరంలో భద్రాచలం దేవస్థానం వారు దత్తత చేసుకున్నారు. అప్పటి వరకు గ్రామస్తులే చందాలు వేసుకుని జయంతి, ఆరాధన ఉత్సవాలు జరిపేవారు. ఆ తర్వాత భద్రాచలం దేవస్థానం దత్తత తీసుకున్నారు. దీంతో మందిరం అభివృద్ధి జరుగుతుందని భక్తులు భావించారు. కానీ జయంతి ఉత్సవాలకు అరకొర నిధులు కేటాయించడంతో మళ్లీ గ్రామస్తులే చందాలు వేసుకుని రామదాసు జయంతి, ఆరాధనోత్సవాలను నిర్వహిస్తున్నారు. అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి ప్రతి కార్యక్రమం నామ మాత్రంగా జరిపి దేవాదాయ అధికారులు చేతులు దులుపుకునేవారు. వాగ్గేయకారుల త్రయంలో ఒకరైన రామదాసు మందిరాన్ని అభివృద్ధి పరచాలని భక్తులతో పాటు ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్ళు గా అధికారులతో పాటు ప్రభుత్వంకి మొర పెట్టుకున్నారు. అయినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు చెపుతున్నారు.
అంతేకాదు రామదాసు మందిరాన్ని పర్యటకంగా తీర్చిదిద్దుతామని పాలకులు చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత రామదాసు ధ్యాన మందిరం అభివృద్ధికి మూడు కోట్ల రూపాయలు వెచ్చించి పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభమై 5 సంవత్సరాలు కావస్తున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. నిధులు విడుదల కావడం లేదంటూ కాంట్రాక్టర్ పనులను నత్తనడకన చేయిస్తున్నారు. జయంతి ఉత్సవాలకు మరో మూడు రోజులే సమయం ఉన్న ఇంతవరకు అధికారులు ఏర్పాట్లు చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పట్టించుకొని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి రామదాసు ఖ్యాతిని దశదిశలా వ్యాపించే విధంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..