Telangana: భూకబ్జాదారులపై పోలీసుల ఉక్కుపాదం.. మంత్రి పోన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు..

కరీంనగర్‎లో భూకబ్జాదారులపైనా పోలీసులు కొరడా దులిపిస్తున్బారు. నెల రోజుల నుండి వరుసగా బీఆర్ఎస్‎కి చెందిన నేతలు, కార్పొరేటర్లను అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరూ కార్పోరేటర్‎లు, ఒక కార్పోరేటర్ భర్తను అరెస్టు చేసి రిమాండ్‎కి పంపారు. మరి‌కొంత‌ మంది‌ కార్పోరేటర్‎లకి నోటీసులు ఇచ్చి విచారణ‎కి రావాలంటూ పోలీసులు అదేశించారు.

Telangana: భూకబ్జాదారులపై పోలీసుల ఉక్కుపాదం.. మంత్రి పోన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు..
Karimnagar Police
Follow us

| Edited By: Srikar T

Updated on: Feb 11, 2024 | 1:30 PM

కరీంనగర్‎లో భూకబ్జాదారులపైనా పోలీసులు కొరడా ఝులిపిస్తున్బారు. నెల రోజుల నుండి వరుసగా బీఆర్ఎస్‎కి చెందిన నేతలు, కార్పొరేటర్లను అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కార్పోరేటర్‎లు, ఒక కార్పోరేటర్ భర్తను అరెస్టు చేసి రిమాండ్‎కి పంపారు. మరి‌కొంత‌ మంది‌ కార్పోరేటర్‎లకి నోటీసులు ఇచ్చి విచారణ‎కి రావాలంటూ పోలీసులు అదేశించారు. భూకబ్జాలపైన ప్రభుత్వం భరతం పడుతుందని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో భూ దందాలకు సంబంధించిన వ్యవహారంలో ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఆరంభం కావడంతో బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయించడం మొదలైంది. ప్రభుత్వ భూములతో పాటు ప్రైయివేట్ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతుంది.

కరీంనగర్‎కు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్ తోట రాములు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచరుడిగా చెప్పుకున్న చీటి రామారావులను అరెస్ట్ చేసిన తరువాత భరోసాతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కేవారి సంఖ్య పెరిగిపోతోంది. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్లూ) పేరిట ప్రత్యేకంగా ఓ టీమ్ కూడా ఏర్పాటు చేశారు. బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కో కేసును దర్యాప్తు చేసే పనిలో నిమగ్నం అయింది కరీంనగర్ పోలీసు యంత్రాంగం. గత కొద్ది రోజుల నుండి అరెస్టుల పరంపర మొదలు పెట్టారు జిల్లా పోలీసులు. దీంతో బాధితులు కమిషనర్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. బాధితులు చెప్పిన వివరాలను విన్న సీపీ సంబంధిత పోలీసు స్టేషన్లకు విచారణకు ఆదేశిస్తున్నారు. కరీంనగర్ సమీపంలో ఉన్న బొమ్మకల్‎లో ప్రభుత్వానికి చెందిన భూములు ఆక్రమించారు. చాలా ఏళ్లుగా పలువురు పోరాటం చేస్తున్నారు. అయినా అధికారుల నుంచి స్పందన రావడం లేదు.

తాజాగా బొమ్మకల్ సర్పంచ్, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పురుమళ్ల శ్రీనివాస్‎పై బాధితులు కరీంనగర్ పోలీసు కమిషనర్‎కు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ పదవి అడ్డు పెట్టుకుని నకిలీ పత్రాలు సృష్టించారని బాధితులు ఆరోపించారు. 30 మందికి పైగా బాధితులము పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశామని, రెవెన్యూ రికార్డులు కూడా తారుమారు చేశారని బాధితులు పురుమళ్ల శ్రీనివాస్‎పై ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్‎తో పాటు అతని అనుచరుల వల్ల తమకు ప్రాణహాని ఉందన్న బాధితులు గతంలో అతనిపై పీడీ యాక్టు పెట్టలేదని వివరించారు. కేవలం శ్రీనివాస్ కాదు చాలా మంది వీటిపై కన్ను వేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నెంబర్‎తో రిజిస్టర్ చేయించుకున్నారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రభుత్వ భూమి ఆక్రమించారాని గతంలో ఫిర్యాదు చేసారు. అదేవిధంగా రేకుర్తి, బ్యాంకు కాలనీ లో పలువురు భూములు ఆక్రమించారు. తీగలాగుంటపల్లిలో కూడా ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. భూములు డబుల్ రిజిస్టర్ చేసినట్లుగా ఎక్కవగా బీఆర్ఎస్ నేతలపైనే ఫిర్యాదులు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

పదిరోజుల క్రితం బీఆర్ఎస్‎కి చెందిన మరో కార్పోరేటర్ జంగిలి సాగర్ అదే విధంగా ‌తీగల గుట్ట పల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ భూమయ్యను, తాజాగా కార్పొరేటర్ భర్త కృష్ణాగౌడ్‎ను‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి‌ పంపారు. వారం రోజుల క్రితం బీఆర్ఎస్ కి చెందిన మరో ముగ్గరు కార్పోరేటర్‎లకి నోటీసులు జారీ చేసి విచారణకి ఆదేశించారు. వీరందరి పైనా భూకబ్జాలు, బెదిరించి అక్రమంగా రిజిస్ట్రేషను చేసుకున్న అరోపణలు ఉన్నాయి.వరుసగా బిఅర్ఎస్ కి చెందిన ‌ముఖ్య నేతలు అరెస్టు ‌కావడంతో పార్టీ లో దడ మొదలైంది.. చాలా మంది కార్పొరేటర్లు బాధితులతో రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాధితులు ఇచ్చిన ప్రతి‌ ఫిర్యాదును పరిశీలిస్తున్నారు పోలీసులు. అంతే కాకుండా స్పాట్ దగ్గరికి వెళ్ళి విచారణ చేబడుతున్నారు. బలమైన ఆధారాలతో బెయిల్ రాకుండా‌ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏకంగా కార్పోరేటర్ జంగిలి‌సాగర్‎పై రౌడిషీట్ నమోదు చేసారు. ఇప్పటికే పోలీసులకి 600 పైగా ఫిర్యాదులు వచ్చాయి. కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో‌ భూకబ్జాల పైన మంత్రి పొన్నం సంచలన కామెంట్స్ చేసారు. ఇప్పుడు ‌అరెస్ట్ అయ్యింది ‌నలుగురు మాత్రమేనని మరో పదిహేను‌ మంది కార్పోరేటర్‎లపై భూకబ్జా అరోపణలు ఉన్నాయని వీరి పైనా కూడా విచారణ సాగుతుందని వెల్లడించారు. త్వరలో మరిన్ని అరెస్టులు‌ ఉంటాయని పొన్నం చెబుతున్నారు. ఈ భూఅక్రమ దందాలో మాజీ‌ మంత్రి గంగుల హాస్తం ఉందని పొన్నం ‌అరోపించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే మరిన్ని‌పెద్ద తలకాయలు బయటికి‌ వస్తాయన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..