AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మార్వాడీ… సడన్‌గా ఏంటీ వేడి!?

జాగో తెలంగాణ వర్సెస్‌ గోబ్యాక్‌ మార్వాడీస్. హైదరాబాద్‌లో.. మోండా మార్కెట్‌లో.. పార్కింగ్‌ విషయంలో జరిగిన ఒక చిన్న గొడవ. అదిప్పుడు ఒక పెద్ద ఉద్యమం. స్థానికుడికి, మార్వాడీకి మధ్య వచ్చిన చిన్న తగువుకు.. కిరాణా వర్తకులు, వస్త్ర వ్యాపారులు, స్వర్ణకారులు, విశ్వబ్రాహ్మణులు, వర్తక సంఘాలు, ఇతర వ్యాపార సంఘాలు వెంటనే రియాక్ట్‌ అయ్యాయి. మార్వాడీస్‌కి వ్యతిరేకంగా. పార్కింగ్‌ గొడవే ఇంతటి రియాక్షన్‌కు కారణం కాదని అర్ధమవుతూనే ఉంది. ఎందుకంటే.. 'ఆమనగల్లు బంద్‌' అని పిలుపునిచ్చింది కూడా మార్వాడీలకు వ్యతిరేకంగానే. మోండా మార్కెట్‌ గొడవకు, ఆమనగల్లు ఇష్యూకు సంబంధమే లేదు. ఇప్పుడనే కాదు.. గతంలోనూ ఆడపాదడపా మార్వాడీలకు వ్యతిరేకంగా గొంతు విప్పిన సందర్భాలున్నాయి. బట్.. ఇప్పుడే ఎందుకని 'గోబ్యాక్‌ మార్వాడీస్' అనే నినాదం పుట్టుకొచ్చింది? పాట కట్టి మరీ చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది? మధ్యలో పొలిటీషియన్లు, హిందువుల ఐక్యతను దెబ్బతీసే కుట్రలు అనే మాటలు ఎందుకొస్తున్నాయి?

Telangana: మార్వాడీ... సడన్‌గా ఏంటీ వేడి!?
Local Traders Vs Marwaris
Ram Naramaneni
|

Updated on: Aug 18, 2025 | 8:55 PM

Share

జస్ట్‌ 5వేల పెట్టుబడితో 50వేల కోట్లు సంపాదించారు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా. ఆయనో మార్వాడీ. మధ్యతరగతి పచారీ సామాన్లకు కేరాఫ్‌.. డీమార్ట్. దాని ఫౌండర్ ఓ మార్వాడీ. ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ మార్వాడీ. బజాజ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఒక మార్వాడీ. ఓయో రూమ్స్‌ ఫౌండర్.. మార్వాడీ. అల్ట్రాటెక్‌ సిమెంట్, రేమండ్, గోయెంకా, సియెట్‌.. కంపెనీలన్నీ మార్వాడీలవి. ఫ్లిప్‌కార్ట్, మింత్రా, లెన్స్‌కార్ట్, జొమాటో కో-ఫౌండర్లు మార్వాడీలు. ఓలా, స్పాప్‌డీల్, షాప్‌క్లూస్ పెట్టిన వాళ్లూ మార్వాడీలే. ఒక లెక్క ప్రకారం భారత్‌లో ఉన్న ధనవంతుల్లో 42 శాతం మార్వాడీలే. ఈ మార్వాడీల వ్యాపార మెళకువల ముందు.. ఎంబీఏలు, మార్కెటింగ్ పాఠాలు, బిజినెస్‌ స్కూల్స్‌ అన్నీ జుజుబి. అలాంటి కమ్యూనిటీపై సడెన్‌గా ఎందుకీ వ్యతిరేకత?  మార్వాడీల వ్యాపార ఆధిపత్యంపై తెలంగాణలో ఎప్పటినుంచో ఆందోళన కనిపిస్తోంది. బట్.. పెద్దగా బయటపడలేదు, అలాంటి సందర్భాలూ రాలేదు. కాని, ఈమధ్య వరుస సంఘటనలు కనిపిస్తున్నాయి మార్వాడీలకు వ్యతిరేకంగా. సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో కార్‌ పార్కింగ్‌ విషయంలో చిన్న తగాదా జరిగింది. ఆ గొడవలో మార్వాడీలు స్థానికుడిపై దాడి చేశారు. విజువల్స్‌ కూడా బయటికొచ్చాయి. ఆ తరువాత గోరేటి రమేష్‌ అనే కళాకారుడు.. మార్వాడీలను టార్గెట్‌ చేస్తూ పాట పాడారు. ఆ సాంగ్‌ సోషల్‌ మీడియాలో చాలా వైరల్‌ అయింది. పాట పాడిన గోరేటి రమేష్‌ను అరెస్ట్ చేశారు కూడా. అదే సమయంలో ఆమనగల్లులో మార్వాడీలకు వ్యతిరేకంగా పెద్ద పోరాటమే జరుగుతోంది. ఇవన్నీ అక్కడక్కడ...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి