Snake Bite: బైక్‌పై కూర్చున్న వ్యక్తి.. సడెన్‌గా వచ్చిన పాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
కొన్ని పరిస్థితులను మనం ఊహించలేం.. ఏ పుట్టలో ఏ పాము ఉందో అనే వినేవుంటారు. కానీ ఓ చోట అదే నిజంగా జరిగింది. పాము అంటే గజగజ వణికిపోతాం. అదే పాము మన దగ్గరికి వస్తే ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. ఇలాంటి ఓ ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పాము అంటేనే ఆమడ దూరం పరిగెడుతాం. అలాంటిది పాము చాలా దగ్గరగా వస్తే.. పాము వల్ల కొంచెంలో ప్రమాదం తప్పిన సంఘటన ఎదురైతే.. ఊహించడానికే భయంకరంగా ఉంది కదూ..! ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ ఘటన హైదరాబాద్ నగరం పాతబస్తీ ప్రాంతంలో చోటు చేసుకుంది. బండ్లగూడ పరిధి క్రిస్టల్‌టౌన్‌లో పాము కాటు ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బైక్‌పై కూర్చున్న వ్యక్తిని.. బైక్ కింద నుంచి వచ్చిన ఓ పాము కాటు వేసింది. వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి తరలించడంతో బాధితుడు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే ఆ వ్యక్తిని కాటు వేసిన పామును ఆస్పత్రికి తీసుకెళ్లారు. అది విషపూరితమా..? కదా..? గుర్తించేందుకు ఇలా చేసినట్లు స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియో చూసినవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. పాము ఎప్పుడు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదని.. ప్రతి క్షణమైనా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
