Adulterated Milk: మీరు పాలు కొనుగోలు చేస్తున్నారా?.. అయితే ఒక్కసారి ఈ వార్త చూడండి..!
Adulterated Milk: కల్తీకి కాదేదీ అనర్హం అంటున్నారు కొందరు కేటుగాళ్లు. కల్తీదందాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
Adulterated Milk: కల్తీకి కాదేదీ అనర్హం అంటున్నారు కొందరు కేటుగాళ్లు. కల్తీదందాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ.. కల్తీ.. కల్తీ.. ఎటు చూసినా కల్తీయే. ఏం తినాలన్నా కల్తీయే. రోజురోజుకు పెరుగుతున్న కల్తీగాళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. డబ్బు సంపాదన కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. వంట నూనెల నుంచి మసాలాల వరకు.. పెట్రోల్ నుంచి పాల వరకు.. కల్తీలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. కాదేదీ కల్తీకి అనర్హం అంటూ రెచ్చిపోతున్నారు. రోజుకో కల్తీదందా వెలుగులోకి వస్తూనే ఉంది. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్నిసార్లు అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నా కల్తీ దందాలకు మాత్రం తెరబడడం లేదు. నిత్యకృత్యంగా మారి.. ప్రజలను రోగాలపాలు చేస్తున్నాయి.
తాజాగా రంగారెడ్డి జిల్లాలో వెలుగుజూసిన పాల కల్తీ స్థానికంగా కలకలం రేపింది. యాచారం మండలం నకర్తమేడిపల్లిలో కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు దాడులు చేశారు. కల్తీ పాల తయారీ కేంద్రంలో 120 లీటర్ల కల్తీ పాలు, 9 గోల్డ్ డ్రాప్ ఆయిల్ ప్యాకెట్లు, లీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ లిక్విడ్, 2 కిలోల వర్ణను స్వాధీనం చేసుకున్నారు ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు. పాలను కల్తీ చేస్తున్న జంగారెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దేశంలో రోజురోజుకు బయటపడుతున్న కల్తీ దందాలతో ఏం తినాలో..ఏం తినకూడదో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. తమ ఇంటిపక్కన తయారు చేసే కల్తీపాలనే తాగుతున్నామా అంటూ స్థానికులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలను కల్తీ చేస్తున్న నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో కల్తీ అంటేనే వణికిపోయేలా శిక్షలు పడాలని కోరుతున్నారు.
Also read:
High Cholesterol Effects: మీ శరీరంలో అధిక కొవ్వు ఉందా?.. రాత్రి సమయంలో ఈ సమస్యలు రావొచ్చు..!