AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మూడ్ ఆఫ్‌లో ఉన్నారా? అయితే ఈ వీడియో చూసి ఫుల్లుగా నవ్వుకోండి.. బుడ్డోడి యాక్టింగ్ మామూలుగా లేదు..!

Viral Video: విద్యార్థులు, ఉద్యోగస్తులకు ఒక్కరోజు సెలవు వచ్చిందంటే.. పండగే అన్నట్లు ఉంటుంది పరిస్థితి. ఇక వారాంతపు సెలవు రోజున అంటే ఆదివారం వచ్చిందంటే..

Viral Video: మూడ్ ఆఫ్‌లో ఉన్నారా? అయితే ఈ వీడియో చూసి ఫుల్లుగా నవ్వుకోండి.. బుడ్డోడి యాక్టింగ్ మామూలుగా లేదు..!
Body Funny Video
Shiva Prajapati
|

Updated on: Mar 10, 2022 | 8:32 PM

Share

Viral Video: విద్యార్థులు, ఉద్యోగస్తులకు ఒక్కరోజు సెలవు వచ్చిందంటే.. పండగే అన్నట్లు ఉంటుంది పరిస్థితి. ఇక వారాంతపు సెలవు రోజున అంటే ఆదివారం వచ్చిందంటే విద్యార్థులు గానీ, ఉద్యోగులు గానీ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. మరుసటి రోజు సోమవారం నాడు యధావిధిగా ఉద్యోగాలకు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. ఒక రోజంతా హాయిగా ఉండి.. మరుసటి రోజు వెంటనే వెళ్లాలంటే ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది.

ఇక స్కూల్ పిల్లల విషయానికి వస్తే.. జనరల్‌గానే పిల్లలు స్కూల్‌కు వెళ్లడానికి మారం చేస్తుంటారు. సెలవొస్తే చాలా వారికి పండుగలా ఉంటుంది. ఆదివారం ఇంట్లో ఉండి.. సోమవారం స్కూల్‌కు వెళ్లాలంటే ఎక్కడ లేని బద్దకాన్ని ప్రదర్శిస్తుంటారు. నానా రకాల నటనాచాతుర్యాన్ని ప్రదర్శిస్తారు. తాజాగా ఓ బుడ్డోడికి సంబంధించిన ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వాడి యాక్టింగ్ ఫర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఓ చిన్న పిల్లవాడు స్కూల్ బ్యాగ్ వేసుకుని రోడ్డువైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో స్కూల్ బస్సు రానే వచ్చింది. దాన్ని చూశాక ఆ బుడ్డోడిలో కళాకారుడు బయటకొచ్చాడు. బలవంతంగానే.. స్కూల్ బస్సు వద్దుకు నడుచుకుంటూ వెళ్లాడు. బస్సుకు కొద్ది దూరంలో ఒక్కసారిగా నిలిచిపోయాడు. ఏమైందా అనుకునేలోపే.. రోడ్డుమీద వెళ్లకిలా పడుకున్నాడు. చిన్నోడు ఒక్కసారిగా అలా పడిపోవడంతో ఏమైందోనని కంగారు పడిన బస్కూలోని స్కూట్ అటెండర్.. చిన్నారి కోసం బస్సు దిగి వచ్చింది. ఆమె రాకను గమనించిన బుడ్డోడు వెంటనే అలర్ట్ అయి పైకి లేచాడు. ఆ చిన్నారిని తీసుకెళ్లి బస్సు ఎక్కించిందామె. అయితే, ఈ సన్నివేశాన్నంతా వీడియో చిత్రీకరించిన చిన్నారి పేరెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోమవారం వచ్చిందంటే ఇలా ఉంటుంది పరిస్థితి ఉంటూ క్యాప్షన్ పెట్టారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

(Video Credits: CBS NEWS)

Also read:

High Cholesterol Effects: మీ శరీరంలో అధిక కొవ్వు ఉందా?.. రాత్రి సమయంలో ఈ సమస్యలు రావొచ్చు..!

జగన్ పెట్టిన మెలిక రాధేశ్యామ్‌ను ఇబ్బంది పెడుతుందా !! వీడియో

TOP 9 ET News: రాధేశ్యామ్ రిలీజ్‌కు జగన్ సర్కార్‌ మెలిక | ప్రభాస్- అనుష్క పెళ్లిపై క్లారిటీ.. వీడియో