AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Cholesterol Effects: మీ శరీరంలో అధిక కొవ్వు ఉందా?.. రాత్రి సమయంలో ఈ సమస్యలు రావొచ్చు..!

High Cholesterol Effects: అతి శృతి మించితే ప్రమాదం తప్పదని అంటుంటరు. అందుకే ఏదైనా సరే మితంగానే ఉండాలంటారు. ఇక మన శరీరంలోని కొవ్వుల గురించి..

High Cholesterol Effects: మీ శరీరంలో అధిక కొవ్వు ఉందా?.. రాత్రి సమయంలో ఈ సమస్యలు రావొచ్చు..!
Fruites
Shiva Prajapati
|

Updated on: Mar 10, 2022 | 8:21 PM

Share

High Cholesterol Effects: అతి శృతి మించితే ప్రమాదం తప్పదని అంటుంటరు. అందుకే ఏదైనా సరే మితంగానే ఉండాలంటారు. ఇక మన శరీరంలోని కొవ్వుల గురించి అయితే ఇది సరిగ్గా సరిపోలుతుంది. మనిషి శరీరంలోని అవయవాలు సక్రమంగా పని చేయడానికి అవసరమైన లిపిడ్స్‌ను కొలెస్ట్రాల్ అందిస్తాయి. ఈ కొవ్వులు రక్త ధమనుల ద్వారా ప్రవహించి.. అవయవాలకు చేరుతుంది. అయితే అతి ప్రమాదమన్నట్లు.. అధిక కొవ్వు కూడా మనిషికి చేటు చేస్తాయి. ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగితే.. ఆ వ్యక్తి గుండె పోటుకు గురయ్యే అవకాశం ఉంది.

గుండె కణాలకు ఆక్సీజన్ చాలా అవసరం పడుతుంది. రక్తం ద్వారా ఆ ఆక్షీజన్ గుండె సహా ఇతర అవయవాలకు అందుతుంది. ఇదే సమయంలో ఆక్సీజన్‌తో పాటు.. కొవ్వులు కూడా రక్తంలో కలిసి ప్రవహిస్తాయి. అలా ప్రవహిస్తున్న క్రమంలో కొవ్వులు.. ధమనుల ధరుల వెంట పేరుకుపోతాయి. రక్త సరఫరాకు అంతరాయం కలిగిస్తాయి. దీనిని పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్(PAD) అని పిలుస్తారు. అధిక కొవ్వులు ఉండటం వల్ల.. కాళ్లకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో కొన్ని ప్రభావితం కావచ్చు. అధిక కొలెస్ట్రాల్ వద్ద కాళ్లలో అనేక సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కాళ్ల నొప్పులు.. PAD అత్యంత ప్రబలమైన లక్షణాలలో కాలు నొప్పి ఒకటి. నడక, జాగింగ్, మెట్లు ఎక్కడం వంటివి చేసినప్పుు కాళ్లలో నొప్పులు వస్తాయి. వైద్యులు దీనిని క్లాడికేషన్ అని పిలుస్తారు. మీరు చేస్తున్న పనిని ఆపివేసిన వెంటనే పెయిన్ తగ్గుతుంది. కొంతమంది తమ కాళ్లు భారంగా ఉన్నాయని, తీవ్రమైన నొప్పి వస్తుందని చెబుతుంటారు. దీనికి కారణం కాళ్లకు రక్త సరఫరా చేసే ధమనుల్లో కొవ్వులు పేరుకోవడమే అని అంటున్నారు నిపుణులు.

రాత్రి సమయంలో తిమ్మిర్లు.. PAD ఉన్న వ్యక్తులు నిద్రపోతున్నప్పుడు కాళ్లలో తిమ్మిర్లు వస్తుంటాయి. సాధారణంగా మడమ, ముందరి పాదాలు, కాలి వేళ్లలో పెయిన్ వస్తుంది. ఇలాంటి సమయంలో మంచం మీద నుండి పాదాలను కిందకు వేలాడదీయం, కుర్చీలో కూర్చోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

అసాధారణ రీతిలో చర్మం రంగు మార్పు.. ధమనులలో కొవ్వులు పేరుకుపోవడం వలన శరీర దిగువ భాగాలకు రక్త ప్రసరణ దెబ్బతింటుంది. భంగిమను బట్టి కాళ్లపై చర్మం రంగు మారుతుంది. PADతో బాధపడుతున్న వ్యక్తులు ఎక్కువ సేపు కూర్చున్నప్పుడు వారి కాలి వేళ్లు లేతగా లేదా నీలం రంగులో కనిపిస్తాయి.

చల్లటి పాదాలు.. స్పర్శకు చల్లగా అనిపించే పాదాలు PADకి సూచన కావచ్చు. అయితే, ఇదే ప్రామాణికం అని కాదు. PAD లేని వారిలోనూ కాళ్లు చల్లగా ఉంటాయి. వయస్సు పెరిగే కొద్ది ఎవరికైనా తరచుగా ఇదే పరిస్థితి తలెత్తుతుది. ఒకవేళ మీ కాలు, పాదం చల్లగా ఉందని అనిపిస్తే ఒకసారి వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

Also read:

Viral Video: చిలిపి పని చేసిన పెళ్లికూతురు.. నోరెళ్లబెట్టిన పెళ్లి కొడుకు.. వైరల్‌ అవుతున్న వీడియో..

Viral Video: బుడ్డోడు చాలా షార్ప్‌.. వాళ్ల అమ్మని ఇట్టే గుర్తుపట్టేశాడు.. భలే గమ్మత్తైన వీడియో..

Summer Skin Care: ఎండకాలంలో చర్మం ఎర్రగా మారుతుందా ? అయితే ఈ వ్యాధులు ఉన్నట్టే..