Viral Video: వావ్ ఇది కదా తల్లి ప్రేమంటే.. మహిళకు అపూర్వంగా కృతజ్ఞతలు తెలిపిన కుక్క.. లవ్లీ వీడియో చూసేయండి..!

Trending Video: తల్లి కుక్క.. తన యజమానికి అపూర్వమైన రీతిలో కృతజ్ఞతలు తెలిపింది. తన పిల్లలకు అండగా నిలిచిన ఆమెకు తనదైన శైలిలో థ్యాంక్స్ చెప్పింది.

Viral Video: వావ్ ఇది కదా తల్లి ప్రేమంటే.. మహిళకు అపూర్వంగా కృతజ్ఞతలు తెలిపిన కుక్క.. లవ్లీ వీడియో చూసేయండి..!
Dog
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 10, 2022 | 6:19 PM

Trending Video: తల్లి కుక్క.. తన యజమానికి అపూర్వమైన రీతిలో కృతజ్ఞతలు తెలిపింది. తన పిల్లలకు అండగా నిలిచిన ఆమెకు తనదైన శైలిలో థ్యాంక్స్ చెప్పింది. దీనికి సంబంధించిన బ్యూటీఫుల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హృదయాన్ని హత్తుకునేలా ఉన్న ఈ వీడియోకు నెటిజన్ల నుంచి అద్భుతమైన రెస్పాండ్స్ వస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వైరల్ వీడియోలో కుక్క నాలుగు పిల్లలు జన్మనిచ్చింది. వాటిని ఆలనా పాలనాను ఇంటి యజమానులు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంటి మహిళ.. కొంత ఆహారాన్ని తీసుకువచ్చి.. కుక్క పిల్లలకు పెట్టింది. ఆ సమయంలో పక్కనే ఉన్న తల్లి కుక్క.. మహిళ పట్ల అపూర్వమైన ప్రేమను కనబరిచింది. తోక ఊపుతూ.. ‘ధన్యవాదాలు’ అన్నట్లుగా తన యజమానికి అద్భుత రీతిలో కృతజ్ఞతలు తెలిపింది. ఆ మహిళ ఒడిలోకి రాగా.. ఆమె తన చేయితో ప్రేమగా తల్లి కుక్క తలను నిమిరింది. ఆ సన్నివేశం చూడముచ్చటగా అనిపించింది. ఈ అద్భుతమైన దృశ్యాలను వీడియో తీసి ట్విట్టర్‌ పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 4 లక్షల మందికిపైగా వీక్షించారు. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. జంతువులకు సహాయం చేసినప్పుడు.. అవి వ్యక్తీకరించే ప్రేమ, కృతజ్ఞతా భావం మానవులు ఊహించలేరని కామెంట్స్ పెడుతున్నారు. మరెందుకు ఆలస్యం ఈ లవ్లీ వీడియోను మీరూ చూసేయండి.

Also read:

RC 15: రామ్‌ చరణ్‌ – శంకర్‌ల చిత్రానికి ఆసక్తికర టైటిల్‌.. చెర్రీ బర్త్‌డే రోజున అధికారిక ప్రకటన.?

UP Election Results 2022: మనతో మామూలుగా ఉండదు మరి.. నెట్టింట్లో రచ్చ చేస్తున్న ‘యోగి’ ఫోటో..

Prabhas: “నేను లవ్ మ్యారెజ్ చేసుకుంటాను”.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ప్రభాస్..