TSPSC: టీఎస్‌పీఎస్‌సీ వ్యవహారంలో తవ్వేకొద్ది సంచలన నిజాలు.. గ్రూప్‌ 1 పరీక్ష పేపర్‌ కూడా లీక్‌.?

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల వ్యహారం రోజుకో మలుపు తిరుగుతోంది. టౌన్‌ ప్లానింగ్‌ ప్రశ్నాపత్రం లీక్‌తో మొదలైన ప్రవీణ్‌ బాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్‌ కేసులో హనీ ట్రాప్‌ వ్యవహరం కూడా బయటపడింది...

TSPSC: టీఎస్‌పీఎస్‌సీ వ్యవహారంలో తవ్వేకొద్ది సంచలన నిజాలు.. గ్రూప్‌ 1 పరీక్ష పేపర్‌ కూడా లీక్‌.?
Tspsc
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 14, 2023 | 12:25 PM

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల వ్యహారం రోజుకో మలుపు తిరుగుతోంది. టౌన్‌ ప్లానింగ్‌ ప్రశ్నాపత్రం లీక్‌తో మొదలైన ప్రవీణ్‌ బాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్‌ కేసులో హనీ ట్రాప్‌ వ్యవహరం కూడా బయటపడింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసులో విస్తుపోయే అంశాలు బయటకు వస్తున్నాయి. గ్రూప్ 1 ఎగ్జామ్‌ పేపర్‌ కూడా లీకైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తుట్టెలా మారిన TSPSC పేపర్‌లీక్ వ్యవహారం. ఆరా తీస్తున్న కొద్దీ పేపర్‌ లీక్స్ విషయాలు బయటపడుతున్నాయి.

గతేడాది అక్టోబర్‌ 16న జరిగిన గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ప్రశ్నాపత్రాన్ని సైతం ప్రవీణ్ లీక్‌ చేశాడాన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జనవరి 13 న ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రశ్నాపత్రాల లీకేజ్‌లో కీలక పాత్రదారుడు ప్రవీణ్‌ కూడా గ్రూప్‌ 1 పరీక్షకు హాజరుకావడం గమనార్హం. పరీక్ష రాసినా కొన్ని కారణాలతో ప్రవీణ్ క్వాలిఫై కాలేకపోయాడు. దీంతో ప్రవీణ్ రాసిన ప్రిలిమ్స్ ఎక్సామ్ పేపర్‌ను అధికారులు వెరిఫై చేస్తున్నారు.

ప్రవీణ్‌కు గ్రూప్‌1లో 103 మార్కులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రవీణ్‌ కింగ్ పిన్‌గా మారాడు. మహిళలతో వ్యవహారాలు నడుపుతూ అడ్డగోలు దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ ఫోన్‌లో విచ్చలవిడిగా నగ్న చిత్రాలు, అసభ్య చాటింగ్‌లను పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ ఫోన్‌ను పోలీసులు ఫోరెన్సిక్‌కు పంపించారు. ఈనెల 25 తర్వాత నివేదిక రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్