Hyderabad: విద్యుత్ మీటర్లు తీసిన అధికారి.. అన్నీ మూసుకొని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించిన ఎంఐఎం ఎమ్మెల్యే

ఇప్పటికి మీరు రెండు సార్లు వచ్చి స్థానికులకు తీవ్ర ఇబ్బందులు పెట్టారు మరోసారి రావాలనుకున్నప్పుడు తన అనుమతి తీసుకుని రావాలంటూ నచ్చజెప్పి అధికారికి హెచ్చరించి అక్కడ నుంచి ఎంఐఎం ఎమ్మెల్యే పంపించారు.

Hyderabad: విద్యుత్ మీటర్లు తీసిన అధికారి.. అన్నీ మూసుకొని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించిన ఎంఐఎం ఎమ్మెల్యే
Mohd Moazam Khan
Follow us
Surya Kala

|

Updated on: Mar 14, 2023 | 1:27 PM

హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో తన నియోజకవర్గంలోని అల్ జుబెల్ కాలనీలో విద్యుత్ శాఖలోని విజిలెన్స్ అధికారులపై ఎంఐఎం ఎమ్మెల్యే  విరుచుకుపడ్డారు.  సలాం పూర్ ఫ్యామిలీస్ ఏరియాలో విజిలెన్స్ అధికారులు దాడులు చేసి పలు విద్యుత్ మీటర్లని సీజ్ చేశారు. దీంతో స్థానికులు ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి వచ్చిన ఎంఐఎం ఎమ్మెల్యే నువ్వు ఎవర్ని అడిగి నా ఏరియాలో అడుగు పెట్టావు నువ్వు ఓవరాక్షన్ చేస్తే రియాక్షన్ మరోలా ఉంటుందని హెచ్చరించారు. అంతేకాదు అధిరులను అన్నీ మూసుకొని మీటర్లు ఇచ్చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో విద్యుత్ శాఖ అధికారి తీవ్ర భయభ్రాంతులకు గురై తొలగించిన విద్యుత్ మీటర్లు తిరిగి ఇచ్చేసి తప్పు అయిపోయింది క్షమించండి అని ఎమ్మెల్యేను కోరారు. అంతేకాదు.. తనను పోలీసులే బలవంతంగా ఇక్కడికి రప్పించారని ఆ అధికారి ఎమ్మెల్యే దృష్టిలోకి తీసుకొచ్చారు.

ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ఏరియాలో ఏమేం జరుగుతాయో మీకు అంతా తెలుసు మీకు కష్టాలు వచ్చినా ప్రజలకు కష్టాలు వచ్చినా బాధ్యత నేను వహించాలని ఎంఐఎం ఎమ్మెల్యే చెప్పారు.  ఇప్పటికి మీరు రెండు సార్లు వచ్చి స్థానికులకు తీవ్ర ఇబ్బందులు పెట్టారు మరోసారి రావాలనుకున్నప్పుడు తన అనుమతి తీసుకుని రావాలంటూ నచ్చజెప్పి అధికారికి హెచ్చరించి అక్కడ నుంచి ఎంఐఎం ఎమ్మెల్యే పంపించారు. అధికారి ఎమ్మెల్యే ని  క్షమాపణ కోరిన తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఓల్డ్ సిటీలో మజ్లీస్ అనుమతులు లేకుండా అధికారులు పెత్తనం చెలాయిస్తే రియాక్షన్ మరి దారుణంగా ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు ఈ ఘటనతో మరోసారి పాతబస్తీలో అధికారుల బానిస బతుకు బయటపడిందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..
పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..
పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..
పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..
వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!
అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!
సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..
సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..