Telangana: మరో దారుణం.. గుండెపోటుతో ఇంటర్‌ విద్యార్థి మృతి. అసలేం జరుగుతోంది..?

ఎప్పుడు.. ఎక్కడ.. ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయపడే పరిస్థితి వచ్చింది. చిన్న పిల్లలు కూడా గుండె పోటుతో మరణిస్తున్న వార్తలు దడ పుట్టిస్తున్నాయి. ఇటీవల గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో అసలు గుండెకు ఏమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి...

Telangana: మరో దారుణం.. గుండెపోటుతో ఇంటర్‌ విద్యార్థి మృతి. అసలేం జరుగుతోంది..?
Representative Image
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 06, 2023 | 7:02 PM

ఎప్పుడు.. ఎక్కడ.. ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయపడే పరిస్థితి వచ్చింది. చిన్న పిల్లలు కూడా గుండె పోటుతో మరణిస్తున్న వార్తలు దడ పుట్టిస్తున్నాయి. ఇటీవల గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో అసలు గుండెకు ఏమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో మరో దారుణం జరిగింది. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని యువ గుండెలు సైతం ఆగిపోతున్నాయి. బండరాళ్లను సైతం పిండికొట్టగల కండలున్నా.. గుండెలు మాత్రం ఎందుకు బలహీనంగా మారిపోతున్నాయి? గుండెపోటుతో ఇంటర్ సెకండియర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం ఖమ్మం జిల్లాలో విషాదం నింపింది.

వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బ్రహ్మణపల్లిలో విషాదం నెలకొంది. ఇంటర్ సెకండియర్‌ చదువుతున్న 18 ఏళ్ల రాకేష్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. 18 ఏళ్ల కుర్రాడు గుండె పోటుతో మరణించడం ఏంటంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే రాకేష్ చిన్నతనం నుంచి గుండె సంభందిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో దారుణం జరిగింది. చండ్రుగొండ మండలానికి చెందిన అనుమోలు ప్రవీణ్‌ (45) అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ప్రవీన్‌ హైదరాబాద్‌లో సినీ ఫీల్డ్‌ కెమెరామాన్‌గా పని చేస్తున్నారని సమాచారం. చిన్న వయసులో గుండె పోటుతో మరణించడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..