Telangana Corona Updates: తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే..
Telangana Corona Updates: తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఘనణీయంగా తగ్గుముఖం పడుతున్నాయి.
Telangana Corona Updates: తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఘనణీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 99 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆ మేరకు సోమవారం నాడు కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నాటికి కరోనా కారణంగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. దాంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,618కి చేరింది. ఇకపోతే గడిచిన 24 గంటల్లో 169 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
మొత్తంగా చూసుకున్నట్లయితే కరోనాను జయించిన వారి సంఖ్య రాష్ట్రంలో 2,93,379కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,676 యాక్టీవ్ కేసులు ఉండగా, వీరిలో 705 మంది హోమ్ అసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. మిగతా వారు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.88శాతంగా ఉంది.
Also read:
Municipal Elections Schedule: ఏపీలో మోగిన మరో ఎన్నికల నగారా.. మార్చి 10వ తేదీనే..
South Heroine: ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా.. ఎక్కడో చూసినట్టుగానే ఉంది కదా..?