AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Disha Encounter: దిశా ఎన్‌కౌంటర్‌కు 5 ఏండ్లు.. పాపం! వారికి ఇంకా తప్పని తిప్పలు..

దిశా నిందితుల ఎన్‌కౌంటర్.. ఈ ఘటన జరిగి 5 ఏండ్లు అయిన ఇప్పటి వరకు దీన్ని ఎవరు మర్చిపోయి ఉండరు.. 2019 నవంబర్ 27న జరిగిన వెటర్నరీ డాక్టర్‌ గ్యాంగ్ రేప్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు స్పష్టించింది. ఈ ఘటన జరిగి 5 సంవత్సరాలు అయిన కోర్టు కేసులు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి.

Disha Encounter: దిశా ఎన్‌కౌంటర్‌కు 5 ఏండ్లు.. పాపం! వారికి ఇంకా తప్పని తిప్పలు..
Disha Encounter
Vijay Saatha
| Edited By: |

Updated on: Dec 06, 2024 | 3:11 PM

Share

తెలంగాణలో సంచలనం రేపిన దిశ ఘటన ఇప్పటికి ఎవరు ఇంకా మర్చిపోలేదు. 2019 నవంబర్ 27న అత్యంత దారుణంగా వెటర్నరీ డాక్టర్‌ను నిందితులు గ్యాంగ్ రేప్ చేశారు. సరిగ్గా పది రోజుల తర్వాత నిందితులను పోలీసులు ఇదే రోజున ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు నిందితులు పోలీసుల కాల్పుల్లో మరణించారు. ఆ తర్వాత నిందితుల ఎన్‌కౌంటర్‌ను సవాల్ చేస్తూ అనేక పిటిషన్లు అటు సుప్రీంకోర్టులను ఇటు హైకోర్టులోను ఫైల్ చేశారు.

సుప్రీంకోర్టు గతంలో సిర్పుర్కర్‌ కమిషన్‌ను నియమించింది. సిర్పుర్కర్‌  కమిషన్ తన రిపోర్టర్‌ను సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసింది. రిపోర్టులో ఎన్‌కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై మర్డర్ కేసులు పెట్టాలి అని సిఫార్సు చేసింది. సిర్పుర్కర్‌  కమిషన్ రిపోర్టును సవాలు చేస్తూ పదిమంది పోలీసులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్ మీద తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఎన్‌కౌంటర్లో పాల్గొన్న పదిమంది పోలీసులపై ఐపీసీ 302 కింద మర్డర్ కేసులు పెట్టాలని దిశను రేప్ చేసిన నిందితుల తరఫున వాదించిన వృందా గోవర్ హైకోర్టును కోరింది. అటు పదిమంది పోలీసుల తరఫున వాదించిన న్యాయవాదులు సిర్పుర్కర్‌  కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం తమ మీద చర్యలు తీసుకోవద్దంటూ, కమిషన్ మీద స్టే విధించాలని పోలీసుల తరపు న్యాయవాదులు వాదించారు. దీంతో ఏకీభవించిన హైకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్లో పోలీసులకి మద్దతుగా కమిషన్ రిపోర్ట్‌పై స్టే విధించింది.

కమిషన్ ముందు తమ వాదన చెప్పుకునేందుకు సరైన సమయం ఇవ్వలేదని ఎన్‌కౌంటర్లో పాల్గొన్న పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో పోలీసుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఉత్తర్వులు జారీ చేశారు. మరో వైపు పోలీసులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు  సిర్పుర్కర్‌ కమిషన్ రిపోర్టును ఇంప్లిమెంట్ చేయాల్సిందేనని వాదనలు వినిపించింది. ప్రస్తుతం హైకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉంది.ఇలా, అటు బాధితురాలు, ఇటు నిందితులు ఎవరు ప్రస్తుతం ప్రాణాలతో లేరు. అయినా సరే కేసుకు సంబంధించి నిజా నిజాలు, సుప్రీంకోర్టు కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆచరణ, అన్నిటిపై ఇంకా న్యాయపోరాటం కొనసాగుతూనే ఉంది. వీటిని ఎదుర్కొంటున్న ఆ పదిమంది పోలీసులు లీగల్ బ్యాటిల్‌ను కొనసాగిస్తూనే తమ విధులు నిర్వర్తిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి