TV9 Conclave 2024: కాంగ్రెస్ ఏడాది పాలనపై టీవీ9 ప్రత్యేక కాంక్లేవ్.. ఎప్పుడంటే

TV9 Conclave 2024: కాంగ్రెస్ ఏడాది పాలనపై టీవీ9 ప్రత్యేక కాంక్లేవ్.. ఎప్పుడంటే

Ravi Kiran

|

Updated on: Dec 08, 2024 | 12:41 PM

ప్రజల పార్టీ నినాదంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తోంది. ఈ నెల 9వ తేదీ నాటికి కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం..

ప్రజా పార్టీ నినాదంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తోంది. ఈ నెల 9వ తేదీ నాటికి కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సాహలు నిర్వహిస్తోంది. నవంబర్ 14 నుంచి మొదలైన ఈ సెలబ్రేషన్స్.. డిసెంబర్ 9వ తేదీతో పూర్తవుతాయి. మొత్తం 26 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో సంబరాలు జరుగుతాయి. ఇలాంటి తరుణంలో ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలో వచ్చిన మార్పు ఎంత.? ప్రతిపక్షం చెబుతున్న విధ్వంసం ఎంత.? ప్రజా ఆమోదం ఎంత.? ప్రభుత్వ వ్యతిరేకత మరెంత.? ఇందులో ఏది నిజం.? ఏది ప్రచారం..? ఇవన్నీ తెలియాలంటే.. ‘What Telangana Thinks Today’ టీవీ9 కాంక్లేవ్ 2024 చూడాల్సిందే. ఈ ఆదివారం ఉదయం 10 గంటలకు మీ టీవీ9లో..

ఈ కాంక్లావ్‌లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ హాజరు కానున్నారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తమ మనసులోని మాటలను వ్యక్తపరచనున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Published on: Dec 06, 2024 05:41 PM