AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కోతుల కోసం పెట్టిన విషం లడ్డూ.. తెలియక తినేసిన నాలుగేళ్ల పసివాడు..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..

కోతులను హతమార్చడం విషగుళికలు కలిపి బాలామృతంను లడ్డూగా చేసి పెట్టారు. ఆ విష గుళికలు కలిపిన పదార్థం తిన్న నాలుగేళ్ల బాలుడు నిండుప్రాణాలు కోల్పోగా మరో బాలిక చికిత్స పొందుతుంది. ఒక్కగానొక్క కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం బోరున వినిపిస్తుంది..

Telangana: కోతుల కోసం పెట్టిన విషం లడ్డూ.. తెలియక తినేసిన నాలుగేళ్ల పసివాడు..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
4 Year Old Boy Died In Mulugu
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Apr 13, 2026 | 5:12 PM

Share

ములుగు, ఏప్రిల్ 13: కోతుల బెడదనుండి విముక్తి కోసం చేసిన ప్రయత్నం ఓ కుటుంబానికి ఊహించని విషాదాన్ని మిగిల్చింది. కోతులను హతమార్చడం విషగుళికలు కలిపి బాలామృతంను లడ్డూగా చేసి పెట్టారు. ఆ విష గుళికలు కలిపిన పదార్థం తిన్న నాలుగేళ్ల బాలుడు నిండుప్రాణాలు కోల్పోగా మరో బాలిక చికిత్స పొందుతుంది. ఒక్కగానొక్క కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం బోరున వినిపిస్తుంది.

ఈ విషాద సంఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలోని NTR కాలనీలో జరిగింది. శ్రవణ్ అనే ఆర్ఎంపి వైద్యుడికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. ఈ పిల్లలు ఆడుకునే క్రమంలో ఇంటి ముందు ఉన్న పల్లె ప్రకృతి వనంలోకి వెళ్లారు. అశ్విని నందన్ అనే 4 ఏళ్ల బాలుడు కోతుల కోసం పెట్టిన ఆ విషపదార్థాన్ని తన వెంట తెచ్చాడు. అవి లడ్డు అనుకొని అశ్వినినందన్ అనే బాలుడు స్వీకరించాడు. మిగిలిన ఇద్దరు పిల్లలు అందులో ఏదో కలిసిందని పడేశారు. ఆ విష గుళికలు కలిపిన పదార్థం తిన్న వెంటనే బాలుడు తీవ్ర అస్వస్థత గురయ్యాడు. అశ్వినీ నందన్ (4) ను వెంటనే MGM ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం దక్కలేదు. నాలుగేళ్లకే ఆ బాలుడికి నూరేళ్లు నిండాయి.

ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన బాలుడి డెడ్ బాడీని మార్చురీకి తరలించారు. అయితే గ్రామపంచాయతీ సిబ్బందే కోతులను హతమార్చడం కోసం ఈ విష గుళికలు పెట్టారని స్థానికులు అంటున్నారు. కోతుల బెడద నివారణ కోసం చేసిన ప్రయత్నం బాలుడి ప్రాణాలు బలి తీసుకున్నాయని బోరున విలపిస్తున్నారు. కోతులను హతమార్చాలనే ఆలోచన తప్పు కాబట్టి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని జంతుప్రేమికులు, మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us