AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shahrukh Khan: పలకరించబోయిన షారుఖ్‌.. పట్టించుకోని రణ్‌వీర్‌

Shahrukh Khan: పలకరించబోయిన షారుఖ్‌.. పట్టించుకోని రణ్‌వీర్‌

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Apr 13, 2026 | 5:07 PM

Share

రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' చిత్రం భారీ విజయం సాధించింది. మనవారు ప్రశంసిస్తున్నా, బాలీవుడ్ ఖాన్స్ మౌనం వహించడం చర్చనీయాంశమైంది. ఇటీవల ఒక పార్టీలో షారుఖ్ ఖాన్ రణ్‌వీర్‌ను మెచ్చుకున్నప్పుడు, రణ్‌వీర్ స్పందన లేకపోవడం వివాదానికి దారితీసింది. యువ తారల విజయాన్ని అమీర్, సల్మాన్ వంటి ఖాన్స్ ఎప్పుడు అంగీకరిస్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది.

ధురంధర్‌ సక్సెస్‌ని రిలీజ్‌ అయిన డే ఒన్‌ నుంచి మన వాళ్లు పొగుడుతూ ఉంటే, నార్త్ లో ఖాన్స్ మాత్రం అసలు పట్టించుకోవట్లేదా? వాళ్లు కనీసం పట్టించుకోలేదన్న ఫీలింగ్‌ రణ్‌వీర్‌లో గూడుకట్టుకుపోయిందా? నార్త్ లో వైరల్‌ అవుతున్న వీడియో ఆ విషయాన్ని చెప్పకనే చెబుతోందా? కమాన్‌ లెట్స్ వాచ్‌… బాలీవుడ్‌ కింగ్‌ షారుఖ్‌ మెచ్చుకోలుగా బుగ్గమీద తడితే.. రణ్‌వీర్‌ దాన్ని యాక్సె్ప్ట్ చేయలేదా? అసలు పట్టించుకోవాలని కూడా అనుకోలేదా? షారుఖ్ లాంటి సీనియర్‌ హీరో మెచ్చుకోలుగా పలకరిస్తే.. పట్టించుకోకుండా పక్కనున్న వాళ్లతో మాట్లాడటం మర్యాదేనా? అంటూ సోషల్‌ మీడియాలో రచ్చ మొదలైంది. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన ధురంధర్‌ సీక్వెల్‌కి వసూళ్ల వర్షం కురుస్తోంది. చూసిన ప్రతి ఒక్కరూ ఏదో రకంగా తమ అభిమానాన్ని స్టేట్‌మెంట్లలో చెబుతూనే ఉన్నారు. అయితే నార్త్ లో ముగ్గురు ఖాన్‌లు మాత్రం నోరు విప్పలేదు. ఇంత గ్రాండ్‌ సక్సెస్‌ గురించి వారెందుకు మాట్లాడలేదా? అనే విషయం మొన్న మొన్నటిదాకా కూడా సినిమా ఇండస్ట్రీలో బర్నింగ్‌ టాపిక్‌. అయితే నార్త్ లో జరిగిన ఓ ప్రైవేట్‌ పార్టీలో షారుఖ్‌కి రణ్‌వీర్‌ తారసపడ్డారు. వెంటనే ప్రశంసాపూర్వకంగా షారుఖ్‌.. రణ్‌వీర్‌ బుగ్గ మీద తట్టారు. జస్ట్ థాంక్యూ అని చెప్పిన రణ్‌వీర్‌, వెంటనే అక్కడి నుంచి మరోవైపు తిరిగి మిగిలిన వాళ్లతో మాట్లాడటం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. సొసైటీ మొత్తం మెచ్చుకుంటున్నప్పుడు ముందుండి పెద్దరికం చాటుకోవాల్సిన షారుఖ్‌ ఇన్నాళ్లూ మాట్లాడకపోవడం.. ఇప్పుడు ఎదురుపడ్డప్పుడు నామ్‌కే ప్రశంసించడం ఏంటనే మాటలు కూడా ఉన్నాయి. మనిషి ఎదురుగా కనిపిస్తే గానీ, సక్సెస్‌ని పొగిడే పెద్దరికం లేదా? అని దుయ్యబడుతున్నవారూ ఉన్నారు. ఎదురుపడ్డప్పుడు రణ్‌వీర్‌ని షారుఖ్‌ ప్రశంసించారు. మరి మిగిలిన ఖాన్‌ల పరిస్థితి ఏంటి? వాళ్లు ఈ సన్నివేశం తర్వాతైనా మారుతానా? మెచ్చుకుంటారా? లేకుంటే ఆ సందర్భం వచ్చినప్పుడు చూసుకుందాం లే అని లైట్‌ తీసుకుంటారా? అనే చర్చ కూడా షురూ అయింది. యంగ్‌స్టర్స్ సక్సెస్‌ని యాక్సెప్ట్ చేసే స్థాయికి ఆమీర్‌, సల్మాన్‌ ఎప్పటికి చేరుకుంటారో అంటూ మాట్లాడుకుంటున్నవారూ కోకొల్లలు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చోరీకి వెళ్లిన దొంగ.. షట్టర్‌లో ఇరుక్కున్న తల.. కట్ చేస్తే

విశ్వంభరకన్నా ముందే స్వయంభు.. ఇప్పుడిదే టాపిక్‌

బాలీవుడ్‌లో వైరల్‌ అవుతున్న బయోపిక్‌లు

ముందుకొచ్చిన ఆదిత్య.. సందీప్‌ ఆలోచిస్తారా ??

Tamannaah Bhatia: మనసుకు నచ్చిందే చేస్తున్నానంటున్న తమన్నా

Follow Us