AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannaah Bhatia: మనసుకు నచ్చిందే చేస్తున్నానంటున్న తమన్నా

Tamannaah Bhatia: మనసుకు నచ్చిందే చేస్తున్నానంటున్న తమన్నా

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Apr 13, 2026 | 4:23 PM

Share

తమన్నా కెరీర్‌లో అత్యంత బిజీగా ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 21 ఏళ్ల తర్వాత కూడా వరుసగా సినిమాలు, ఓటీటీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న మిల్కీబ్యూటీ, దక్షిణాది ఆదరణపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రయోగాత్మక చిత్రాలకు ఓకే చెబుతూ, తన కెరీర్‌ను విజయవంతంగా మలచుకుంటున్నారు. వ్యక్తిగత జీవితం తర్వాత సినిమాలపై రెట్టింపు దృష్టితో దూసుకుపోవడం విశేషం.

తమన్నా ఇప్పుడేం చేస్తున్నారు? పెద్దగా కనిపించడం లేదే.. అని సౌత్‌ ఆడియన్స్ అనుకునేలోపు… నేనొచ్చేశా అంటూ స్పెషల్‌ స్టేట్‌మెంట్స్ తో వార్తల్లో తళుక్కుమంటున్నారు మిల్కీబ్యూట. సినిమా పతప్ప నాకు వేరే యావ లేదంటున్నారు. కెరీర్‌లో గ్యాప్‌ వచ్చిన వాళ్లో, కావాలని స్పేస్‌ తీసుకుని మళ్లీ రీస్టార్ట్ చేసిన వాళ్లో… కెరీర్‌ని మళ్లీ ప్రారంభిస్తున్నట్టుగా ఉంది అని అంటారు. కానీ, ఇప్పుడు ఈ మాటను తమన్నా చెబుతున్నారు. సినిమా కెరీర్‌ స్టార్ట్ అయిన తర్వాత ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఇన్‌స్టంట్‌గా వైరల్‌ అవుతోంది. నేను నటించిన సినిమాలన్నీ వరుసగా రిలీజ్‌ అవుతున్నాయి. ఏ నటికైనా కెరీర్‌ స్టార్ట్ అయిన 21 ఏళ్ల తర్వాత ఇంత బిజీగా ఉండటం అదృష్టం. నేను ఆ విషయంలో చాలా లక్కీ ఫెలో… దక్షిణాది పరిశ్రమలో నాకు లభిస్తున్న ఆదరణ చూసి ఆనందంగా ఉంది. అందుకే నేను కూడా సరికొత్త కథలకు, ప్రయోగాత్మక చిత్రాలకు నో చెప్పకుండా ఓకే చేస్తున్నా అని అంటున్నారు తమన్నా. ఎప్పటికప్పుడు కెరీర్‌ని షేప్‌ చేసుకోవడంలో తమన్నా సూపర్‌ సక్సెస్‌ అవుతున్నారన్నది క్రిటిక్స్ మాట. తమన్నా చెప్పినట్టే రెండు దశాబ్దాలుగా ఆమెను సౌత్‌ ఆడియన్సే ఆదరించారు. సౌత్‌ ఫ్యామిలీస్‌లో నేనో మెంబర్‌ని అని మిల్కీ బ్యూటీ చెప్పడంలో తప్పేమీ లేదు అన్నది అబ్జర్వర్స్ మాట. ఓ వైపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు, స్పెషల్‌ సాంగులు, ఓటీటీ కథలతో బంపర్‌ గర్ల్ అనిపించుకుంటున్నారీ లేడీ. ఆ మధ్య ప్రేమ వ్యవహారంతో కాస్త డీవియేట్‌ అయినట్టు అనిపించినా, ఇప్పుడు రెట్టింపు ఫోకస్‌తో కెరీర్‌ ని మలచుకుంటున్నారు. ఇదే కాన్‌సెన్‌ట్రేషన్‌ ఉంటే గనుక, సౌత్‌లో నయన్‌కి తమన్న మంచి పోటీ అవుతారనే మాట కూడా ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Peddi: ‘పెద్ది’ వాయిదా ఖాయమా ??

Follow Us