AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi: ‘పెద్ది’ వాయిదా ఖాయమా ??

Peddi: ‘పెద్ది’ వాయిదా ఖాయమా ??

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Apr 13, 2026 | 4:13 PM

Share

పెద్ది సినిమా విడుదల వాయిదాపై అనేక ఊహాగానాలు నడుస్తున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్నా సందడి లేకపోవడం, స్పెషల్ సాంగ్ షూట్ ఇంకా పెండింగ్‌లో ఉండటంతో సినిమా వాయిదా పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. నిర్మాతలు మాత్రం మౌనంగా ఉండి, అన్నీ సరైన తర్వాత పక్కా అప్‌డేట్ ఇవ్వాలని చూస్తున్నారు. పెద్ది జూన్ లేదా జూలైలో విడుదలయ్యే అవకాశం ఉంది.

వాళ్లూ వీళ్లూ అంటున్నారని, అడుగుతున్నారని మనం రియాక్ట్ అయితే ఎలా? నిజం తెలుసు కాబట్టి.. కాస్త నిలకడగా ఉండటం కూడా ఇంపార్టెంటే అని అనుకుంటున్నారు పెద్ది మేకర్స్. ఇంతకీ వాళ్లకు తెలిసిన నిజమేంటి? నిలకడ మీద జనాలకు వాళ్లు చెప్పదలచుకున్నదేంటి? కమాన్‌ లెట్స్ వాచ్‌… పెద్ద సినిమా రిలీజ్‌ అంటే ఎలా ఉండాలి? అందులోనూ పెద్ది లాంటి మూవీ బాక్సాఫీస్‌ మీద దండయాత్రకు వస్తున్నప్పుడు ఆ అరేంజ్‌మెంట్స్ ఇంకెంత గట్టిగా ఉండాలి. పట్టుమని 20 రోజులు కూడా లేవు. అయినా పెద్ది సందడి చేయడం లేదు.. సినిమా పోస్ట్ పోన్‌ అవుతుందని చెప్పడానికి ఇంతకన్నా రుజువేం కావాలనే విశ్లేషణలు ఆల్రెడీ కనిపిస్తున్నాయి. పెద్ది ఈ నెల్లో వచ్చే పరిస్థితే లేదన్నది విశ్లేషకుల మాట. మృణాల్‌ చేస్తున్నారని, మానస వారణాసి స్టెప్పులేస్తారని వైరల్‌ అయిన స్పెషల్‌ సాంగ్‌ షూట్‌ ఇంకా జరగనే లేదు. ఈ వారం జరగాల్సిన స్పెషల్‌ సాంగ్‌ షూటింగ్‌ కూడా వాయిదా పడిందన్నది వార్త. షూట్‌ ఇంకాస్త బ్యాలన్స్ ఉంది కాబట్టే మేకర్స్ ఏమీ మాట్లాడటం లేదు. ఒక్కసారి.. అన్నీ స్ట్రీమ్‌లైన్‌లోకి వచ్చాక, పక్కా డీటైల్స్ తో జనాలకు అప్‌డేట్‌ ఇచ్చేయాలని భావిస్తున్నారట నిర్మాతలు. నిర్మాణ సంస్థ నుంచి వచ్చే న్యూస్‌ కాంక్రీట్‌గా ఉండాలి. సాలిడ్‌ అప్‌డేట్‌ అయి ఉండాలన్న ప్లానింగ్‌ నడుస్తోందట. ఇంతకీ పెద్ది ఈ నెల నుంచి వాయిదా పడి జూన్‌లో ల్యాండ్‌ అవుతుందా? జులైకి షిఫ్ట్ అవుతుందా? అంటే ప్రస్తుతానికి నో క్లూ… ఆ మాట చెప్పాల్సింది మేకర్సే అంటోంది ఫిల్మ్ నగర్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..

అనారోగ్యం పాలైన భర్త.. బైక్‌ మెకానిక్‌గా మారిన భార్య

రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము

Jailer 2: జైలర్‌2 లో పవన్‌.. ఇంతకీ నిజమేనా ??

Follow Us