Telangana: తాగితే కిక్కు ఎక్కుతుంది.. తాగకుంటే పిచ్చి ఎక్కుతుంది.. మహబూబ్‌నగర్‌లో కల్తీ కల్లు కల్లోలం..
తాగితే కిక్కు ఎక్కుతుంది.. తాగకుంటే పిచ్చి ఎక్కుతుంది.. అలాగని తాగకుండా ఉండలేని పరిస్థితి రోజువారి కూలీలది. ఆ వ్యసనమే ఇప్పుడు వారి ప్రాణాల మీదకు తెచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాగిన 16మంది మృత్యువు అంచులదాకా వెళ్లారు. వారి వింత చేష్టలు, ప్రవర్తన కుటుంబసభ్యుల్ని కంగారెత్తించాయి. ఇంతకీ కల్తీ కల్లు పాపం ఎవరిది? కల్లు మాఫియా కక్కుర్తికి ఎగబడుతుంటే ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఒకరికి మాట పడిపోయింది.. మరొకరికి మూతి వంకర పోయింది.. ఇంకొకరు ఫిట్స్ వచ్చినట్టు ఊగిపోయారు.. ఏం జరుగుతుందో తెలియదు.. ఒకరి తర్వాత మరొకరు.. వింత చేష్టలతో ప్రభుత్వాస్పత్రిలో 16మంది అడ్మిట్ అయ్యారు. వీళ్లంతా మహబూబ్‌నగర్ జిల్లాని దొడ్లోనిపల్లి, కోయనగర్, మోతీనగర్, తిమ్మసానిపల్లి, ఎనుగొండకు చెందినవాళ్లు. అందరూ కూలీలు. రోజులాగే కల్లు తాగారు. కానీ ఈసారి ఇంటికి వెళ్లలేదు. ఆస్పత్రిపాలయ్యారు. కల్తీ మాఫియా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. కల్లులో క్లోరోహైడ్రెడ్, అల్ఫాజోలం, డైజోఫాం లాంటి మత్తు పదార్థాలతో ఉపయోగిస్తున్నారు. మత్తు కోసం వీటి డోస్ పెంచడంతో కూలీలు పిచ్చెక్కిపోయినట్టు ప్రవర్తించారు. ఆస్పత్రి ట్రీట్‌మెంట్.. బాధిత కుటుంబసభ్యులు ఏమన్నారో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సమీ అందిస్తారు.
పొద్దంతా చేసిన కష్టాన్ని మర్చిపోయేందుకు కూలీలంతా కల్లు తాగుతుంటారు. కానీ ఈసారి మాత్రం ఆ కల్లులో ఏదో కలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. నాలుగైదు రోజులుగా చికిత్స అందిస్తున్నప్పటికీ కొంత మంది ఆరోగ్య పరిస్థితిలో మార్పు రావడం లేదు. 16మంది బాధితులు ఆస్పత్రిలో చేరితో వారిలో ముగ్గురి పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. ఐసీయూలో ట్రీట్‌మెంట్‌కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సమీ అందిస్తారు.

కల్తీ మాఫియా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. బాధితులు ఆస్పత్రిలో చేరాక.. తూతూ మంత్రంగా శాంపిల్స్ సేకరించారని మండిపడుతున్నారు. ప్రాణనష్టం జరగలేదు కనుక సరిపోయింది.. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు.
కల్తీకల్లుకి సంబంధించి శాంపిల్స్ తీసుకున్నామని.. రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. ఒక్కరోజు దొరక్క పోతే.. దిమాక్ ఖరాబ్ అవుతుంది. కల్తీకల్లు వ్యాపారులు లక్షలాది మందిని కల్తీ కల్లుకు బానిసలు చేశారు. ఇప్పుడు వారి ఆరోగ్యంతో ఫుట్‌బాల్ ఆడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణాలు పోయాక దాడులు చేయడం కాదూ.. ముందే మేల్కొవాలంటున్నాయి బాధిత కుటుంబాలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..