Telangana: బావిలో పడిన పిల్లిని కాపాడేందుకు వెళ్లిన మహిళ.. చివరకు ఏం జరిగిందంటే..?
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.. బావిలో పడిన పెంపుడు పిల్లిని కాపాడబోయి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ షాకింగ్ ఘటన పెద్దపల్లి జిల్లాలోని కమాన్‌పూర్ మండలం కిష్టంపల్లెలో సోమవారం జరిగింది.

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.. బావిలో పడిన పెంపుడు పిల్లిని కాపాడబోయి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ షాకింగ్ ఘటన పెద్దపల్లి జిల్లాలోని కమాన్‌పూర్ మండలం కిష్టంపల్లెలో సోమవారం జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కిష్టంపల్లె గ్రామానికి చెందిన లింగాల లసుము (55) ఇంట్లో ఉన్న పెంపుడు పిల్లి .. సోమవారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలోని చేద బావిలో పడింది.
పిల్లి అరుపులను గమనించిన ఆమె.. బావి దగ్గరకు వెళ్లి చూసింది. ఆ తర్వాత పిల్లిని బకెట్ తో బయటకు తీసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు లసుము బావిలో పడిపోయింది.
గమనించిన కుటుంబసభ్యులు.. వెంటనే లసుము తీసేందుకు ప్రయత్నించారు. చిన్న కుమారుడు రాకేశ్ స్థానికుల సాయంతో లసుమును బయటకు తీసేసరికి అప్పటికే ఆమె మరణించినట్లు పోలీసులు తెలిపారు.




ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కమాన్ పూర్ ఎస్ఐ షేక్ మస్తాన్ తెలిపారు. మృతురాలి కొడుకు పిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..