Telangana: బోధన్ బీఆర్‌ఎస్‌లో ముసలం.. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్‌పర్సన్ మధ్య వార్.. మధ్యలో పోలీసులు..
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో అధికార పార్టీలో ముసలం ముదిరి పాకాన పడింది. బోధన్ ఎమ్మెల్యే షకీల్ వర్సెస్ మున్సిపల్ కౌన్సిలర్ శరత్ రెడ్డిల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. బోధన్ లో తూము శివమ్మ చారిటబుల్ ట్రస్టు పేరుతో శరత్ రెడ్డి చలివేంద్రాలను ఏర్పాటు చేశారు.

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో అధికార పార్టీలో ముసలం ముదిరి పాకాన పడింది. బోధన్ ఎమ్మెల్యే షకీల్ వర్సెస్ మున్సిపల్ కౌన్సిలర్ శరత్ రెడ్డిల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. బోధన్ లో తూము శివమ్మ చారిటబుల్ ట్రస్టు పేరుతో శరత్ రెడ్డి చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. చలివేంద్రాలకు సంబంధించిన ఫ్లెక్సీలపై సీఎం కేసీఆర్, కవిత ఫొటోలను పెట్టి ఎమ్మెల్యే షకీల్ ఫొటోలను పెట్టకపోవడంతో మళ్లీ అగ్గిరాజుకుంది. రాత్రికి రాత్రే వాటిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
దీనిపై కౌన్సిలర్ శరత్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే నిన్న మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన షకీల్.. అక్కడ తూము పద్మావతిని ఆహ్వానించకపోవడంతో ప్రొటోకాల్ రగడ షురూ అయింది. షకీల్ వ్యవహారం, పోలీసుల తీరుపై పద్మ టీవీ9తో మాట్లాడారు. తమని ఎమ్మెల్యే షకీల్, అనుచరులు చాలా రోజులుగా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఏ కార్యక్రమం చేసినా అడ్డుకుంటున్నారన్నారు.
ఇప్పటి వరకు తన ఫ్లెక్సీలు ఎక్కడా పెట్టలేదన్నారు పద్మ. తన వార్డులోకి వెళ్లినా.. తనకు కనీసం సమాచారం ఇవ్వడం లేదన్నారు. షకీల్ అండతో పోలీసులు తమని బెదిరిస్తున్నారని.. షకీల్‌పై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు.




ఇకపోతే శరత్ తనతో పాటు సీఐ పైనా అసభ్య పదజాలం ఉపయోగించారంటున్నారు ఏసీపీ కిరణ్‌కుమార్. అంతు చూస్తానని బెదిరించారని.. దీంతో కేసు నమోదు చేశామన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
