AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అయ్యో దేవుడా.. ప్రాణాలు తీస్తున్న వీధి కుక్కలు.. మరో చిన్నారి బలి..

హైదరాబాద్‌ అంబర్‌పేటలో చిన్నారి ప్రదీప్‌ను కుక్కలు పీక్కుతిన్న ఘటన కళ్లముందు కదలాడుతూనే ఉంది. అంతలోనే కుక్క దాడిలో గాయపడ్డ మరో చిన్నారి.. మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచింది.

Telangana: అయ్యో దేవుడా.. ప్రాణాలు తీస్తున్న వీధి కుక్కలు.. మరో చిన్నారి బలి..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Mar 18, 2023 | 6:17 PM

Share

హైదరాబాద్‌ అంబర్‌పేటలో చిన్నారి ప్రదీప్‌ను కుక్కలు పీక్కుతిన్న ఘటన కళ్లముందు కదలాడుతూనే ఉంది. అంతలోనే కుక్క దాడిలో గాయపడ్డ మరో చిన్నారి.. మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లిలో 13ఏళ్ల చిన్నారి మహేశ్వరి మృతి కన్నవాళ్లను కన్నీరుమున్నీరయ్యేలా చేసింది. నెల రోజుల క్రితం మహేశ్వరి ఇంటిముందు చదువుకుంటున్న సమయంలో కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో మహేశ్వరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. దాదాపు నెల రోజులు డాక్టర్లు ట్రీట్‌మెంట్ అందించారు. కానీ ఫలితం లేకుండాపోయింది. చికిత్స పొందుతూ మహేశ్వరి ప్రాణాలు విడిచింది.

వీధి కుక్కల నియంత్రణ.. తీసుకోవాల్సిన చర్యలు టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేస్తూనే ఉంది. ప్రజల్లో అవగాహనతో పాటు అధికారుల్లో చలనం వచ్చింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. దీంతో కుక్కల స్వైరవిహారం చిన్నారుల ప్రాణాల మీదకు తెస్తోంది. కరీంనగర్‌లో కుక్కల దాడిలో చిన్నారి మహేశ్వరి చనిపోతే.. మరో రెండు ఘటనల్లో ఇద్దరు చిన్నారులు శునకాల దండయాత్ర నుంచి తృటిలో తప్పించుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని 48వ డివిజన్‌లో ఓ బాలుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో అటు వైపు నుంచి వచ్చి ఓ కుక్క బాలుడిపై దాడి చేసింది. స్థానికులు అలర్ట్ అయి కుక్కను తరిమేయడంతో బాలుడు సేఫ్ అయ్యాడు.అయితే అప్పటికే గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు .

వరంగల్ జిల్లా బ్యాంక్‌ కాలనీలోనూ సేమ్ సీన్‌. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న జశ్వంత్ అనే బాలుడిపై వీధి కుక్క ఎటాక్ చేయబోయింది. స్థానికులు అప్రమత్తం కావడంతో కుక్క పారిపోయింది. కుక్క దాడి నుంచి తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేత హతం..!
మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేత హతం..!
ఇంకా తేలని TGPSC గ్రూప్‌ 1 వివాదం.. హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా!
ఇంకా తేలని TGPSC గ్రూప్‌ 1 వివాదం.. హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో
ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో
బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు
బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..