Covid-19: గురుకులంలో కరోనా కలకలం.. 27 మంది విద్యార్థులకు పాజిటివ్.. తల్లిదండ్రుల్లో టెన్షన్..
కఠిన కరోనా నిబంధనలతో పాఠశాలలు నిర్వహిస్తున్నప్పటికీ.. మహమ్మారి వెంటాడుతూనే ఉంది. తాజాగా తెలంగాణ
Coronavirus Positive: కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు కోలుకుంటున్నాయి. ఈ తరుణంలో కొన్ని రోజుల నుంచి విద్యారంగం కూడా తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. కఠిన కరోనా నిబంధనలతో పాఠశాలలు నిర్వహిస్తున్నప్పటికీ.. మహమ్మారి వెంటాడుతూనే ఉంది. తాజాగా తెలంగాణ ఖమ్మం జిల్లాలోని వైరా బాలికల గురుకులంలో కరోనా కలకలం రేపింది. తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాలలోని 27 మంది విద్యార్థులకు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గురుకులంలోని 650 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇటీవల ఇంటికి వెళ్లొచ్చిన ఓ విద్యార్థినికి జ్వరం, అస్వస్థతగా ఉండటంతో గురుకులం అధికారులు ఆమెకు కరోనా పరీక్షలు చేయించారు.
ఈ పరీక్షలో విద్యార్థినికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ప్రిన్సిపల్ లక్ష్మి తెలిపారు. దీంతో గురుకులంలోని విద్యార్థినులందరికీ పరీక్షలు నిర్వహించగా.. 27మందికి కరోనా సోకినట్లు ఆమె తెలిపారు. పరీక్షల అనంతరం కరోనా బారిన పడిన విద్యార్థులందరినీ ఇళ్లకు పంపించినట్లు పేర్కొన్నారు. ముందుగా వారి తల్లిదండ్రులకు సమాచారమిచ్చి.. వారి పర్యవేక్షణలోనే ఇళ్లకు పంపించినట్లు ఆమె తెలిపారు. ఈ విషయం తెలిసిన మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు.. భయాందోళనతో వారి వారి పిల్లలను కూడా ఇళ్లకు తీసుకెళుతున్నారు.
Also Read: