Google Maps: గూగుల్ మ్యాప్స్‌తో ఇన్ని పనులు చేయొచ్చా? ఇప్పటి వరకూ తెలియలేదే! చాలా ప్రయోజనాలున్నాయ్..
గూగుల్ మ్యాప్స్ చాలా మంది వినియోగించి ఉంటారు. అయితే ఈ మ్యాప్స్ కేవలం నావిగేషన్, మ్యాపింగ్ సర్వీసెస్ మాత్రమే కాక ఇతర ప్రత్యేకమైన సేవలు కూడా అందిస్తాయి. హోటళ్లు బుక్ చేసుకోవాలన్నా.. లేదా విమానాల టికెట్లు బుక్ చేసుకోవాలన్నా గూగుల్ మ్యాప్స్ ద్వారా చేయొచ్చు. అదెలా అని ఆలోచిస్తున్నారా? ఈ కథనం చివరి వరకూ చదవండి..

గూగుల్ మ్యాప్స్.. అందరికీ పరిచయం ఉన్నదే. ఏదైనా అడ్రస్ తెలియకపోయినా.. ఏదైనా తెలియన ప్రాంతానికి వెళ్లినా ఇది మనకు బాగా ఉపకరిస్తుంది. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్ ద్వారా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి, డెస్టినేషన్ ఎంటర్ చేసి ఫోన్లో లొకేషన్ ఎనేబుల్ చేస్తే చాలు మనం ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి తీసుకెళ్తుంది. గూగుల్ మ్యాప్స్ గురించి ఇది మాత్రమే చాలా మందికి తెలుసు. అయితే ఈ గూగుల్ మ్యాప్స్ కేవలం నావిగేషన్, మ్యాపింగ్ సర్వీసెస్ మాత్రమే కాక ఇతర ప్రత్యేకమైన సేవలు కూడా అందిస్తాయి. హోటళ్లు బుక్ చేసుకోవాలన్నా.. లేదా విమానాల టికెట్లు బుక్ చేసుకోవాలన్నా గూగుల్ మ్యాప్స్ ద్వారా చేయొచ్చు. అదెలా అని ఆలోచిస్తున్నారా? ఈ కథనం చివరి వరకూ చదవండి..
ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..
గూగుల్ మ్యాప్స్ యాప్.. మొదటిగా మీ స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్, ల్యాప్ టాప్ లోని గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేయండి.
డెస్టినేషన్.. మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో ఆ ప్రదేశం పేరును సెర్చ్ చేయండి. నగరం, ఎయిర్ పోర్టు ఏది కావాలంటే దానిని సెర్చ్ బార్ లో ఎంటర్ చేసిన వెతకండి.
హోటళ్లు కావాలంటే ఇలా..
మీకు కావాల్సిన ప్రాంతం మీకు మ్యాప్స్ లో కనిపించాక.. స్క్రీన్ ని జూమ్ చేయండి. ఆ తర్వాత సెర్చ్ నియర్ బై బటన్ ను క్లిక్ చేయండి. తరర్వాత కేటగిరీల లిస్ట్ నుంచి హోటల్స్ అనే దానిని ఎంపిక చేసుకోండి. అప్పుడు గూగుల్ మ్యాప్స్ మీకు ఆ సమీపంలోని హోటళ్ల జాబితాను మీకు చూపిస్తుంది. ప్రైస్, రేటింగ్ వంటి ఫిల్టర్లను ఉపయోగించి జాబితాను తనిఖీ చేయండి. ఏదైనా హోటల్ ను ఎంపిక చేసుకొని వ్యూ మోర్ డిటైల్స్ పై క్లిక్ చేయండి. ఫొటోలు, రివ్యూలు, బుకింగ్ ఆప్షన్లను తనిఖీ చేయండి. మీకు అనుకూలంగా ఉన్న హోటల్ ని ఎంపిక చేసుకొని బుక్ నౌ లేదా వ్యూ వెబ్ సైట్ అనే బటన్ పై క్లిక్ చేసి, అందులో ఉన్న వసతి, రేట్ల గురంచి తెలుసుకోండి, హోటల్ ను బట్టి డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ నుంచే బుక్ చేసుకొనే అవకాశం ఉంటుంది. లేదా హోటల్ వెబ్ సైట్లోకి వెళ్లి హోటల్ రూం బుక్ చేసుకోవచ్చు.
ఎయిర్ పోర్టులు అయితే ఇలా..
మీరు ఫ్లైయి బుక్ చేయాలి అనుకుంటే.. గూగుల్ మ్యాప్స్ సెర్చ్ మార్ లో ఎయిర్ పోర్ట అని టైప్ చేయాలి. మీకు డెస్టినేషన్ కు దగ్గరలోని ఎయిర్ పోర్టులను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత దానిపై క్లిక్ చేసి, మీ ప్లాన్ ను అనుగుణంగా ఎక్స్ ప్లోర్ ఫ్లైట్స్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకొని ఫ్లైట్ల కోసం వెతకండి. అప్పుడు మీకు అందుబాటులో ఉన్న ఫ్లైట్ల జాబితా కనిపిస్తుంది. మీరు డేట్, ఎయిర్ లైన్, ధర వంటి ఫిల్టర్లను వినియోగించి ఆప్షన్లను తనిఖీ చేయొచ్చు. ఆ తర్వాత మీరు ఓ ఫ్లైట్ను ఎంపికచేసుకొని వ్యూ మోర్ డిటైల్స్ ను ఎంపిక చేసుకోవాలి. బుకింగ్ ప్రక్రియ ఎయిర్ లైన్స్ కు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ ద్వారా లేదా ఏదైనా బుకింగ్ ప్లాట్ ఫారం ద్వారా జరుగుతుంది. అప్పుడు స్క్రీన్ పై కనిపించే సూచనలను అనుసరించి బుకింగ్ ను పూర్తి చేయండి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..