Windows 10: విండోస్ 10 వాడుతున్నారా? ఇకపై అప్‌డేట్స్ క్లోజ్! ఇప్పుడేం చేయాలంటే..
మీరు ఇంకా విండోస్ 10 ఓఎస్ నే వాడుతున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ కు మైక్రోసాఫ్ట్ సపోర్ట్ నిలిపివేయనుంది. 2025 అక్టోబర్ 14 నుంచి విండోస్ 10 కు ఎలాంటి సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు. మరి విండోస్ 10 వాడుతున్నవాళ్లు ఇప్పుడు ఏం చేయాలి?

విండోస్ 10 ఓఎస్ కు ఇకనుంచి అప్ డేట్స్, సపోర్ట్ నిలిపివేయనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ నుంచి విండోస్ 11 సాఫ్ట్ వేర్ వచ్చి చాలా ఏళ్లు అయింది. అయితే ఇప్పటికీ చాలామంది విండోస్ 10 వాడుతున్నారు. అయితే ఇకనుంచి వాళ్లు ఎలాంటి సాఫ్ట్ వేర్ అప్ డేట్స్, సపోర్ట్ వంటివి పొందలేరు. అంటే విండోస్ 10 వాడుతున్న వాళ్ల పీసీ ప్రమాదంలో పడినట్లే. మరి ఇప్పుడు వీళ్లంతా ఏం చేయాలంటే..
నో అప్‌డేట్స్
విండోస్ 10కు సపోర్ట్ నిలిపివేయనున్నట్లు రెండేళ్ల క్రితమే మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ డేట్ దగ్గరకొచ్చింది. ప్రస్తుతం విండోస్10 వాడుతున్నవాళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓఎస్ ను కంటిన్యూ చేయొచ్చు. కానీ, ఏదైనా సమస్య వస్తే సపోర్ట్ ఉండదని, అలాగే సెక్యూరిటీ అప్‌డేట్స్ అప్ డేట్స్ కూడా రావని మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తన బ్లాగ్ లో పోస్ట్ చేశాడు.
ఏం చేయాలంటే..
విండోస్ 10 ఓఎస్ ఇకపై కూడా పని చేస్తుంది. అయితే వాటికి అప్ డేట్స్ రావు కాబట్టి సాఫ్ట్ వేర్ కు వైరస్, మాల్వేర్ వంటివి సోకితే దాన్ని రిమూవ్ చేయడం కష్టమవుతుంది. ఆన్‌లైన్ బ్రౌజింగ్ చేసేవారికి కచ్చితంగా విండోస్ 11 కు అప్ డేట్ అవ్వాలి. పీసీని సేఫ్ గా ఉంచుకోవాలంటే ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వచ్చే సాఫ్ట్ వేర్ ను మాత్రమే వాడుతుండాలి. అంటే విండోస్ 10 యూజర్లందరూ విండోస్ 11 కు అప్ డేట్ అవ్వడం మంచిది. అయితే 2028 అక్టోబర్ వరకు సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ అప్‌డేట్స్ కొనసాగుతాయని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఇది బేసిక్ ప్రొటెక్షన్ మాత్రమే అందిస్తుంది. ఒకవేళ మీరు విండోస్ 10 నే వాడాలి కానీ, ఫుల్ సెక్యూరిటీ కావాలి అనుకుంటే దానికై ఎక్సటెండెడ్ సెక్యూరిటీ అప్‌డేట్స్ ప్రోగ్రామ్‌ను తీసుకోవాలి. దీనికి కొంతమొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




