WhatsApp Blocked: వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌ చేశారా..? ఈ టిప్స్‌తో తెలుసుకోండిలా..!

Subhash Goud

Subhash Goud |

Updated on: Jan 15, 2022 | 3:54 PM

WhatsApp Blocked: ప్రస్తుతం మొబైల్‌ ఫోన్‌ వినియోగం అధికమైపోయింది. వాట్సాప్‌ లేనిది స్మార్ట్‌ఫోన్‌ ఉండదు. చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి..

WhatsApp Blocked: వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌ చేశారా..? ఈ టిప్స్‌తో తెలుసుకోండిలా..!
Follow us

WhatsApp Blocked: ప్రస్తుతం మొబైల్‌ ఫోన్‌ వినియోగం అధికమైపోయింది. వాట్సాప్‌ లేనిది స్మార్ట్‌ఫోన్‌ ఉండదు. చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు రోజు వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌ చాటింగ్‌లతో కాలం గడిపేస్తుంటారు. యూజర్లను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్‌ సంస్థ కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్స్‌ను తీసుకువచ్చింది. ఇక వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్‌ చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే వాట్సాప్‌లో పలు ప్రైవసీ కారణాల వల్ల మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోలేరు. అయితే కొన్ని టిప్స్‌ పాటిస్తే మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో చాలా సులభంగా తెలుసుకోవచ్చు.

ప్రొఫైల్ పిక్చర్ ఉందో లేదో చూడండి

ఎవరైనా మిమ్మల్ని బ్లాక్‌ చేస్తే ముందుగా ప్రొఫైల్ పిక్చర్ నుంచే తెలుసుకునే అవకాశం ఉంది. మీకు వారి ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తే.. అవతలి వాళ్లు మిమ్మల్ని బ్లాక్ చేయనట్లే. కనిపించకపోతే మాత్రం ఇందులో ఉన్న ఇతర పద్ధతులు కూడా ఫాలో అవ్వండి. ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ చేశారని అనుకుంటున్నారో.. వారి లాస్ట్ సీన్, ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేయడానికి ప్రయత్నించండి. అయితే వాళ్లు లాస్ట్ సీన్ డిజేబుల్ చేస్తే బ్లాక్ చేయకపోయినా కనిపించదు. ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించకపోతే కచ్చితంగా బ్లాక్ చేసినట్లే.

ఇవన్ని జరిగితే బ్లాక్ చేసినట్లే..

ఒకవేళ అవతలి వ్యక్తులు మిమ్మల్ని బ్లాక్ చేస్తే.. మీకు కేవలం ఒక్క టిక్ మాత్రమే వస్తుంది. రెండు టిక్ మార్కులు గానీ, బ్లూ టిక్స్ కనిపించవు. అందుకే మీరు మెసేజ్ పెట్టి ఎంత సేపయినా ఈ టిక్స్ రాకపోతే మిమ్మల్ని దాదాపు బ్లాక్ చేసినట్లేనని గుర్తించాలి. అంతేకాకుండా మిమ్మల్ని బ్లాక్ చేసినవారికి మీరు కాల్ చేస్తే ఆ కాల్ అవతలివారికి వెళ్లదు. అక్కడ మీకు రింగింగ్ బదులు కాలింగ్ అని మాత్రమే వస్తుంది. అయితే అవతలివాళ్లు ఇంటర్నెట్ ఆపినా కాలింగ్ అనే వస్తుంది.వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే.. వారితో మీరు గ్రూప్ క్రియేట్ చేయడం కూడా కుదరదు. అందుకే ఎవరైతే బ్లాక్ చేశారని మీరు అనుకుంటున్నారో వారితో గ్రూప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. అయితే అవతలివాళ్లు ప్రొఫైల్ పిక్చర్ డిలీట్ చేసి, లాస్ట్ సీన్ హైడ్ చేసి, నెట్ ఆఫ్ చేసినా పైవన్నీ జరుగుతాయి. అయితే నెట్ ఆఫ్ చేసిన వాళ్లు కాసేపటికి అయినా ఆన్ చేస్తారు కాబట్టి.. ఇవన్నీ జరిగితే దాదాపు మిమ్మల్ని బ్లాక్ చేసినట్లే అనుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

WhatsApp Mistakes: మీరు వాట్సాప్‌ వాడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే కష్టాల్లో చిక్కుకున్నట్లే..!

WhatsApp: మ‌రో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్‌తో రానున్న వాట్సాప్‌.. ఇక‌పై వాయిస్ మెసేజ్‌ల‌ను అలా కూడా వినొచ్చు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu