WhatsApp: మీరు వాట్సాప్ వాడుతున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఈ డిజిటల్ యుగంలో వాట్సాప్ కంపల్సరీగా మారింది. అయితే మీ అకౌంట్ హ్యాక్ అయిందని అనుమానం వస్తే భయపడకుండా, తక్షణమే చేయాల్సిన ముఖ్యమైన 5 పనులు ఈ కథనంలో వివరంగా ఉన్నాయి. లింక్డ్ డివైజ్‌లు చెక్ చేయడం నుంచి టూ-స్టెప్ వెరిఫికేషన్ సెట్ చేసుకోవడం వరకు మీ వాట్సాప్ అకౌంట్‌ను సేఫ్‌గా ఉంచుకోవడానికి ఏం చేయాలంటే..?

ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు వాట్సాప్ వాడుతున్నారు. వాట్సాప్ వల్ల మాటలు తగ్గి చాటింగ్ పెరిగింది. ఈ యాప్ లేకపోతే ఉండలేని స్థితికి వచ్చేశారు. అయితే సైబర్ అటాక్స్ పట్ల ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. మీరు పంపని మెసేజ్‌లు వేరేవాళ్లకు వెళ్లాయంటే మీ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారని అర్థం. అయితే టెన్షన్ పడకుండా పెద్ద నష్టం జరగకముందే ఈ 5 స్టెప్స్ ఫాలో అయి అకౌంట్‌ను లాక్ చేయండి.
తక్షణ చర్యలు – అకౌంట్ రికవరీ
కాంటాక్ట్‌లకు అలర్ట్: ముందుగా మీ అకౌంట్ ప్రమాదంలో ఉందని మీ కాంటాక్ట్‌లో ఉన్నవారికి తెలియజేయండి. దీనివల్ల వారు మీ పేరుతో డబ్బు లేదా వ్యక్తిగత వివరాలను అడిగినా, నమ్మకుండా ఉంటారు.
లింక్డ్ డివైజెస్ చెక్: వాట్సాప్ సెట్టింగ్‌లకు వెళ్లి లింక్డ్ డివైజెస్ చెక్ చేయండి. హ్యాకర్లు తరచుగా వాట్సాప్ వెబ్ వంటి మరో పరికరం నుండి లాగిన్ అవుతారు. ఎక్కడైనా లాగిన్ అయి ఉంటే వెంటనే లాగ్ అవుట్ చేయండి.
లాగ్ అవుట్ – లాగిన్: మీ ఫోన్‌లో వాట్సాప్ నుండి లాగ్ అవుట్ చేసి, మళ్లీ లాగిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీరు తిరిగి లాగిన్ అయినప్పుడు మీకు SMS ద్వారా వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఇలా చేయడం వల్ల పాత సెషన్‌లు డిస్‌కనెక్ట్ అవుతాయి. హ్యాకర్ మళ్లీ లాగిన్ అవ్వాలంటే వారికి ఈ కోడ్ అవసరం అవుతుంది.
వాట్సాప్ సపోర్ట్: వెంటనే వాట్సాప్ సపోర్ట్‌కు కంప్లైంట్ ఇచ్చి మీ పరిస్థితిని వివరించి, సహాయం కోరండి.
సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు: సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయడం కూడా ఉపయోగకరం. దేశంలో మీరు 1930 నంబర్‌కు కాల్ చేయడం లేదా అధికారిక సైబర్ క్రైమ్ వెబ్‌సైట్ ద్వారా నివేదించవచ్చు.
సిమ్ స్విచ్ అనుమానం ఉంటే..
మీ సిమ్ స్విచ్ అయిందని లేదా మీ మొబైల్ నంబర్ వేరొకరికి బదిలీ అయిందని అనుమానం వస్తే ఆలస్యం చేయకుండా మీ నెట్‌వర్క్ ఆపరేటర్‌ను సంప్రదించి మీ సిమ్‌ను బ్లాక్ లేదా రికవరీ చేయండి. హ్యాకర్లు చాలాసార్లు సిమ్‌ను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటారు.
అకౌంట్ రికవరీ అయిన తర్వాత..
మీరు మీ అకౌంట్‌ను తిరిగి పొందిన వెంటనే, ఈ భద్రతా చర్యలు తప్పక తీసుకోండి:
టూ స్టెప్ వెరిఫికేషన్: వెంటనే టూ స్టెప్ వెరిఫికేషన్‌ను ఎనేబుల్ చేసి బలమైన పిన్‌ను సెట్ చేయండి.
పాస్‌వర్డ్‌లు మార్చండి: వాట్సాన్ కోసం మాత్రమే కాకుండా మీ జీమెయిల్ లేదా వాట్సాప్‌కు లింక్ చేయబడిన ఏదైనా సోషల్ మీడియా అకౌంట్‌ల పాస్‌వర్డ్‌లను కూడా మార్చండి.
బ్యాంకు లావాదేవీలపై నిఘా: మీ బ్యాంక్, UPI యాప్‌లలో హెచ్చరికలు, అనధికార లావాదేవీలపై శ్రద్ధ వహించండి.
గుర్తుంచుకోండి.. జాగ్రత్తే బెస్ట్ సెక్యూరిటీ అని మరిచిపోకండి.తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దు, ఓటీపీలను ఎప్పుడూ షేర్ చేయవద్దు. భయపడే బదులు, ఇతరులను హెచ్చరించడం, మోసపూరిత అభ్యర్థనలను విస్మరించడం తెలివైన పని.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




