AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hybrid Car: హైబ్రిడ్‌ కారు గురించి వినే ఉంటారు.. కానీ ప్రయోజనాలు తెలుసా..?

Hybrid Car:ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ పెరుగుతున్న నేపథ్యంలో 'హైబ్రిడ్' అనే పదం చర్చల్లో ఉంది. చాలామందికి ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కారు మధ్య తేడా తెలియదు. హైబ్రిడ్ కారు అంటే సంప్రదాయ ఇంజిన్ ఎలక్ట్రిక్ మోటార్‌

Hybrid Car: హైబ్రిడ్‌ కారు గురించి వినే ఉంటారు.. కానీ ప్రయోజనాలు తెలుసా..?
Hybrid Car
uppula Raju
|

Updated on: Jun 02, 2022 | 6:45 PM

Share

Hybrid Car:ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ పెరుగుతున్న నేపథ్యంలో ‘హైబ్రిడ్’ అనే పదం చర్చల్లో ఉంది. చాలామందికి ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కారు మధ్య తేడా తెలియదు. హైబ్రిడ్ కారు అంటే సంప్రదాయ ఇంజిన్ ఎలక్ట్రిక్ మోటార్‌ ఇంజన్‌ కలయికగా చెప్పవచ్చు. ఇందులో పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే ఇంజన్‌కి ఒక ఎలక్ట్రిక్ మోటారు జతచేసి ఉంటుంది. కొన్ని హైబ్రిడ్ కార్లు పూర్తిగా ఎలక్ట్రిక్ మోటార్లపై నడుస్తాయి. కొన్ని ఇంధన ఇంజిన్లతో నడుస్తాయి. కారులో ఈ రెండూ కలిసి పనిచేస్తాయి.హైబ్రిడ్ కారులో అధిక ఓల్టేజీ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది.

ఇది కారుకు మెరుగైన మైలేజీని అందిస్తుంది. హైబ్రిడ్ కారులో బ్యాటరీని ఛార్జ్ చేయడానికి సంప్రదాయ ఇంజిన్‌ని ఉపయోగిస్తారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కార్ కంపెనీలు వివిధ రకాల హైబ్రిడ్ డిజైన్లను తయారుచేస్తున్నాయి. హైబ్రిడ్‌ కారులో ఎలక్ట్రిక్ మోటారు, ఇంధన ఇంజిన్ రెండు ఉంటాయి. కారుని ఇంధన ఇంజిన్‌తో పాటు, ఎలక్ట్రిక్ మోటారు ద్వారా కూడా నడపవచ్చు. కొన్ని వాటిలో కారు ఇంధన ఇంజిన్‌కు సహాయం చేయడానికి ఎలక్ట్రిక్ మోటారు ఉపయోగిస్తారు. ఈ డిజైన్ ఉద్దేశ్యం కారు ఇంధన పనితీరును మెరుగుపరచడం మాత్రమే. సాంప్రదాయ కార్ల కంటే హైబ్రిడ్ వాహనాల శక్తి సామర్థ్యం చాలా ఎక్కువ. ఇంకా హైబ్రిడ్ కావడం వల్ల ఇంధన వినియోగం, గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించవచ్చు.హైబ్రిడ్ కార్లు సంప్రదాయ వాహనంతో పోల్చినట్లయితే తక్కువ శక్తిని వినియోగిస్తాయి. తక్కువ విద్యుత్‌ని ఉపయోగిస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నష్టాలు, నమ్మకద్రోహాలు.. కాలసర్ప దోషంతో ఈ రాశులు జాగ్రత్త!
నష్టాలు, నమ్మకద్రోహాలు.. కాలసర్ప దోషంతో ఈ రాశులు జాగ్రత్త!
మీరు ఒక గంట పాటు మీ మొబైల్ లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
మీరు ఒక గంట పాటు మీ మొబైల్ లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
కళ్లు లేకుండా పుట్టిన శిశువు.. ఆస్పత్రికి రూ. 1 కోటి ఫైన్!
కళ్లు లేకుండా పుట్టిన శిశువు.. ఆస్పత్రికి రూ. 1 కోటి ఫైన్!
ముంబై, లక్నో దారిలోనే మరో 4 జట్లు.. లిస్ట్‌లో ఆ టీంపేరు?
ముంబై, లక్నో దారిలోనే మరో 4 జట్లు.. లిస్ట్‌లో ఆ టీంపేరు?
OTTని షేక్ చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTTని షేక్ చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ 2026 విడుదల.. రేపట్నుంచే దరఖాస్తులు
ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ 2026 విడుదల.. రేపట్నుంచే దరఖాస్తులు
బావులన్నీ గుండ్రంగానే ఎందుకు.. తాతల కాలం నాటి అసలైన ప్లాన్ ఇది!
బావులన్నీ గుండ్రంగానే ఎందుకు.. తాతల కాలం నాటి అసలైన ప్లాన్ ఇది!
బైక్‌లలో డీజిల్‌ ఎందుకు ఉపయోగించరు.. ఎవ్వరికి తెలియని రహస్యం ఇదే
బైక్‌లలో డీజిల్‌ ఎందుకు ఉపయోగించరు.. ఎవ్వరికి తెలియని రహస్యం ఇదే
బడ్జెట్ లో అదిరిపోయే రుచితో కొబ్బరన్నం కోడికూర చేసేయండి
బడ్జెట్ లో అదిరిపోయే రుచితో కొబ్బరన్నం కోడికూర చేసేయండి
ఈ రాశులకు విపరీత రాజయోగం..ఉద్యోగ పదోన్నతులు పక్కా..!
ఈ రాశులకు విపరీత రాజయోగం..ఉద్యోగ పదోన్నతులు పక్కా..!